Bank News | ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తన కస్టమర్లకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా ఇకేవైసీ (KYC) పూర్తి చేసుకోవాలని బ్యాంక్ కోరుతోంది. బ్యాంక్ (Bank) ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు సెంట్రల్ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే మాత్రం బ్యాంక్ అకౌంట్ పని చేయకపోవచ్చు.
బ్యాంక్ ఇప్పటికే కస్టమర్లకు నోటీసులు, ఎస్ఎంఎస్‌ల ద్వారా కేవైసీ విషయాన్ని తెలియజేసింది. కస్టమర్లు ఎవరైతే బ్యాంక్ నుంచి సీకేవైసీకి సంబంధించి నోటీసులు లేదా ఎస్ఎంఎస్ లేదా కాల్స్ పొందారో.. వారు వెంటనే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాలని తెలిపింది. మార్చి 24లోపు ఈ పని పూర్తి చేసుకోవాలని వెల్లడించింది. ఒకవేళ ఇప్పటికే సీకేవైసీ పూర్తి చేసుకున్న వారు ఉంటే.. ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది.
రూ.85 వేల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.35 వేలకే పొందండి.. రూ.1 కట్టక్కర్లేదు, 100 శాతం ఫైనాన్స్!
బ్యాంక్ ఈ సీకేవైసీ విధానం ద్వారా కస్టమర్లకు చెందిన డాక్యుమెంట్లను డిజిటల్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటుంది. గతంలో బ్యాంకులు పలు మార్లు కస్టమర్లను కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరేవి. అయితే ఇప్పుడు ఈ సీకేవైసీ ద్వారా భవిష్యత్‌లో ఇలాంటి తిప్పలు ఉండవు. కేవైసీ విధానం సులభతరం అవుతుంది. ఒక్కసారి కేవైసీ పూర్తి చేసుకుంటే సరిపోతుంది.
రైతులకు బ్యాంక్ శుభవార్త.. నిమిషాల్లో రూ.లక్షా 60 వేల లోన్, ఇంట్లో నుంచే పొందండిలా!
కస్టమర్లు వారి కేవైసీ డాక్యుమెంట్లు బ్యాంక్ కు అందిస్తే.. బ్యాంక్ వీటిని డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. దీని వల్ల కస్టమర్లు తర్వాత వివిధ సర్వీసుల కోసం మళ్లీ కేవైసీ చేసుకోవాల్సిన పని లేదు. బ్యాంక్ తన సెంట్రల్ కేవైసీ నుంచి కస్టమర్ వివరాలను తీసుకుంటుంది. వీటిని కస్టమర్ వివరాలతో మ్యాచ్ చేసుకుంటుంది. అందువల్ల కస్టమర్లు మళ్లీ పదే పదే కేవైసీ పూర్తి చేసుకోవాల్సిన పని ఉండదు.
కాగా చాలా బ్యాంకులు తన కస్టమర్లకు కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరుతూ ఉంటాయి. అయితే మోసగాళ్లు కూడా ఇతే సరైన ఛాన్స్ అన కేవైసీ రూపంలో బ్యాంక్ కస్టమర్లను మోసం చేస్తున్నారు. అందువల్ల మీరు కేవైసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోండి. అంతేకానీ ఆన్‌లైన్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏమర పాటుగా ఉంటే మాత్రం బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలని లేదంటే బ్యాంక్ అకౌంట్ పని చేయదని మోసగాళ్లు మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు. వీటిల్లో లింక్ ఉంటుంది. వీటిపై క్లిక్ చేస్తే మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Bank news, Bank of Baroda, Banks, Saving account