Bank of Baroda alert: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్

Bank of Baroda alert | బరోడా అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించి అర్బన్, మెట్రో నగరాల్లో మినిమమ్ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1,000 నుంచి రూ.2,000 చేశారు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే గరిష్టంగా రూ.200 వరకు జరిమానా చెల్లించాలి.

news18-telugu
Updated: January 31, 2019, 12:28 PM IST
Bank of Baroda alert: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్
Bank of Baroda alert: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్
  • Share this:
మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉందా? అయితే మారుతున్న మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. బరోడా అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్(BASA) మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్ ఫిబ్రవరి 1 నుంచి మారనుంది. ఈ విషయాన్ని జనవరి మొదటివారంలోనే కస్టమర్లకు తెలిపింది బ్యాంక్ ఆఫ్ బరోడా. మారిన మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ తెలుసుకొని అకౌంట్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మంచిది.


బరోడా అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించి అర్బన్, మెట్రో నగరాల్లో మినిమమ్ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1,000 నుంచి రూ.2,000 చేశారు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే గరిష్టంగా రూ.200 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.500 నుంచి రూ.1,000 చేశారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే గరిష్టంగా రూ.100 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలేమీ మారలేదు.4



ఇవి కూడా చదవండి:
Loading...
SBI Data leak: ఎస్‌బీఐ అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్

Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్

జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?
First published: January 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...