BANK OF BARODA A SPECIAL DIGITAL PLATFORM FOR RETAIL AND AGRICULTURAL LENDING RECENTLY LAUNCHED BANK OF BARODA GH VB
Digital Platform: రిటైల్, వ్యవసాయ రుణాలకు స్పెషల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్.. లాంచ్ చేసిన ప్రముఖ బ్యాంక్..
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ బ్యాంకు రిటైల్... సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (MSME), వ్యవసాయ రుణాలను కో-లెండింగ్‌గా అందించేందుకు ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ బ్యాంకు రిటైల్.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (MSME), వ్యవసాయ రుణాలను కో-లెండింగ్‌గా అందించేందుకు ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCs)తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఈ బ్యాంక్(Bank) కనీసం 10 ఎన్బీఎఫ్సీలతో(SBFC) భాగస్వామి కావాలని యోచిస్తోంది. రాబోయే రెండేళ్లలో కొత్తగా లాంచ్ చేసిన డిజిటల్ ప్లాట్‌ఫామ్(Digital Platform) ద్వారా రూ.10,000 కోట్ల కో-లెండింగ్ లోన్ బుక్‌ను(Lending Loan Book) క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అండర్‌రైటింగ్ కోసం రూల్-బేస్డ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. రూల్-బేస్డ్ అల్గారిథమ్‌లు క్రెడిట్ అసెస్మెంట్ చెక్‌లను ఎనేబుల్ చేస్తాయి. రిటైల్, MSME, వ్యవసాయ కో-లెండింగ్ ప్రొడక్ట్ ఆఫర్లను ఎనేబుల్ చేస్తాయి. రూల్-బేస్డ్ అల్గారిథమ్‌లతో కో-లెండింగ్ లోన్స్ ప్రాసెస్ మరింత సులభతరం అవుతుందని బ్యాంక్ తెలిపింది. “కో-లెండింగ్ మోడల్‌పై లేటెస్ట్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సెక్యూర్డ్, అన్-సెక్యూర్డ్ ప్రొడక్ట్స్ కోసం కో-లెండింగ్ ఆప్షన్ 1 (నాన్-డిస్క్రీషనరీ), ఆప్షన్ 2 (డిస్క్రీషనరీ) రెండింటినీ నిర్వహించగల సామర్థ్యాలు డిజిటల్ కో-లెండింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్నాయి." అని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం U GRO క్యాపిటల్, పైసాలో(Paisalo)తో సహా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (NBFCలు) కో-లెండింగ్ టై-అప్‌లను కలిగి ఉంది. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అయిన Edelweiss హౌసింగ్, సెంట్రమ్ హౌసింగ్ ఫైనాన్స్ లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
“ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ టెస్టింగ్ దశలో మేం U GRO క్యాపిటల్‌తో టైఅప్ అయ్యాం. ప్లాట్ఫామ్లో చేరేందుకు మరో నాలుగు ఫైనాన్స్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్న. ఇప్పటివరకు, భారతదేశంలో సహ-రుణాలు లేదా కో-లెండింగ్ లోన్లు ఇవ్వడానికి ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదు. ప్రతిదీ మాన్యువల్‌గా జరిగింది లేదా కో-లెండింగ్‌గా చెప్పినవి వాస్తవానికి లైవ్ అసైన్మెంట్లు,” అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా చెప్పారు. కొత్త కో-లెండింగ్ ప్లాట్‌ఫామ్ సమర్థవంతమైన లోన్ మేనేజ్మెంట్ సైకిల్ కోసం డిమాండ్ జనరేషన్, ఎస్క్రో మేనేజ్మెంట్, కలెక్షన్ మేనేజ్మెంట్ను ఉపయోగిస్తుందని అఖిల్ పేర్కొన్నారు.
18-24 శాతం వద్ద రుణాలు తీసుకుంటున్న రుణగ్రహీతలకు వడ్డీ రేటును తగ్గించడమే లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ముందడుగులు వేస్తోంది. ఇందుకు ఎండ్-టు-ఎండ్ కో-లెండింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ తీసుకురావడమే ఏకైక మార్గంగా కనిపించిందని చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ చెప్పారు. సాధారణంగా, కో-లెండింగ్ ద్వారా వడ్డీ రేటు దాదాపు 8 శాతం ఉంటుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కో-లెండింగ్ వైపు మొగ్గు చూపాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, వ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు ఇవి ఈ మోడల్ ని ఆమోదిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.