Home /News /business /

BANK LOCKER FEE HOW MUCH SBI PUNJAB NATIONAL BANK AND ICICI BANK CHARGE GH VB

Bank Locker Fee: బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ బ్యాంకుల లాకర్ ఛార్జీల వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఆభరణాలు దాచుకోవడానికి సేఫ్ ప్లేస్‌లుగా నిలుస్తున్నాయి బ్యాంకు లాకర్లు . భారత్‌లోని ప్రధాన బ్యాంకులు లాకర్ సేవలను అందిస్తున్నాయి. లాకర్ సైజు ఆధారంగా ఈ సేవలపై ఫీజును బ్యాంకులు నిర్ధారిస్తాయి.

ముఖ్యమైన డాక్యుమెంట్స్(Documents), ఆభరణాలు దాచుకోవడానికి సేఫ్ ప్లేస్‌లుగా(Safe Place) నిలుస్తున్నాయి బ్యాంకు లాకర్లు(Bank Lockers). భారత్‌లోని ప్రధాన బ్యాంకులు లాకర్ సేవలను అందిస్తున్నాయి. లాకర్ సైజు ఆధారంగా ఈ సేవలపై ఫీజును బ్యాంకులు నిర్ధారిస్తాయి. ఏరియా (పట్టణ, గ్రామీణ లేదా మెట్రో) ఆధారంగా కూడా ఈ ఫీజు మారవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో బ్యాంకులు అందించే సేఫ్ డిపాజిట్ లాకర్(Safe Deposit Locker), సేఫ్ కస్టడీ ఆర్టికల్ ఫెసిలిటీటీస్‌పై మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సవరించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం కొత్త లాకర్ నియమాలు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ల బ్యాంక్ లాకర్ ఛార్జీలను పరిశీలిద్దాం.

Viral News: ఆ బుడతడు చేసిన పనికి మీరు షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా రూ.1.4 లక్షలతో..


SBI లాకర్ ఛార్జీలు

1) SBI స్మాల్ లాకర్ రెంట్ ఛార్జీలు

అర్బన్, మెట్రో నగరాల్లో: రూ.2000+ Gst

గ్రామీణ, సెమీ ప్రాంతాల్లో: రూ.1500+Gst

2) SBI మీడియం లాకర్ రెంటల్ ఛార్జీలు

అర్బన్, మెట్రో నగరాల్లో: రూ.4000+ Gst

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో: రూ. 3000+Gst

3) SBI లార్జ్ లాకర్ రెంటల్ ఛార్జీలు

అర్బన్, మెట్రో నగరాల్లో: రూ.8000+Gst

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో: రూ.6000+Gst

4) SBI ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ రెంటల్ ఛార్జీలు

అర్బన్, మెట్రో నగరాల్లో: రూ.12,000+Gst

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో: రూ. 9000+Gst

ఈ రెంటల్ ఛార్జీలతో పాటు స్మాల్, మీడియం లాకర్లకు SBI రూ.500 వన్-టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఛార్జీని కూడా విధిస్తుంది. లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్లకు ఈ ఫీజు రూ.1,000 (GSTతో కలిపి) చెల్లించాలి.

మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని ..ఏం ఘనకార్యం వెలగబెట్టాడో చూడండి

ICICI బ్యాంక్ లాకర్ ఛార్జీలు
ICICI బ్యాంక్ స్మాల్ సైజు లాకర్‌కు రూ.1,200- 5,000 వరకు ఫీజు వసూలు చేస్తుంది. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్లకు రెంటు రూ.10,000- 22,000 వరకు ఉంటుంది. ఈ ఛార్జీలపై GST మినహాయింపు ఉంది. అయితే ICICI బ్యాంక్ యాన్యువల్ రెంట్ అమౌంట్‌ మొత్తాన్ని ముందుగానే వసూలు చేస్తుంది.

PNB లాకర్ ఛార్జీలు
PNB జనవరి 15 నుంచి లాకర్ ఛార్జీలను పెంచింది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో యాన్యువల్ లాకర్ రెంట్ అమౌంట్ రూ.1,250 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. పట్టణ, మెట్రో నగరాల్లో ఈ ఛార్జీ రూ.2,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Bank charges, Bankers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు