Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 12 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 12 సెలవులు... ఎప్పుడెప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in September 2021 | బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్‌లో బ్యాంకులకు 12 సెలవులు (Bank Holidays) వచ్చాయి. ఈ సెలవులకు తగ్గట్టుగా మీ బ్యాంకింగ్ లావాదేవీలు (Banking Transactions) ప్లాన్ చేసుకోండి.

  • Share this:
    మీకు సెప్టెంబర్‌లో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ఉన్నాయా? బ్యాంకుకు వెళ్లే ముందు సెప్టెంబర్‌లో ఉన్న బ్యాంకు సెలవుల (Bank Holidays) వివరాలు తెలుసుకోండి. ఆగస్ట్‌లో ఫెస్టివల్ సీజన్ మొదలైంది. డిసెంబర్ వరకు పండుగల సీజన్ కొనసాగుతుంది. కాబట్టి వరుసగా పండుగలు  వస్తుంటాయి. బ్యాంకులకు సెలవులు కూడా వస్తుంటాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉండటం మామూలే. ఇవి కాకుండా పండుగల సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 12 సెలవులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 7 సెలవులు ఉన్నాయి. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.

    Bank Holidays September 2021: తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు


    సెప్టెంబర్ 5- ఆదివారం
    సెప్టెంబర్ 10- వినాయక చవితి
    సెప్టెంబర్ 11- రెండో శనివారం
    సెప్టెంబర్ 12- ఆదివారం
    సెప్టెంబర్ 19- ఆదివారం
    సెప్టెంబర్ 25- నాలుగో శనివారం
    సెప్టెంబర్ 26- ఆదివారం

    Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా? రోజూ రూ.7 పొదుపు చేస్తే చాలు

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 10 వినాయక చవితి సెలవు మాత్రమే ఉంది. సెప్టెంబర్‌లో ఓ లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి, సెప్టెంబర్ 11 రెండో శనివారం, సెప్టెంబర్ 12 ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం రోజు కూడా సెలవు వచ్చే అవకాశం ఉంది. ఈ సెలవును ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ఆరోజు కూడా బ్యాంకులు తెరుచుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఖాతాదారులు ఈ వరుస సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇతర రాష్ట్రాల్లో సెలవుల వివరాలు తెలుసుకోండి.

    IRCTC Special Tourist Train: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్... రూ.6,620 ధరకే కాశీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

    Bank Holidays October 2021: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు


    సెప్టెంబర్ 5- ఆదివారం
    సెప్టెంబర్ 8- శ్రీమంత శంకరదేవ తిథి
    సెప్టెంబర్ 9- తీజ్ (హరితాలికా)
    సెప్టెంబర్ 10- వినాయక చవితి
    సెప్టెంబర్ 11- రెండో శనివారం
    సెప్టెంబర్ 12- ఆదివారం
    సెప్టెంబర్ 17- కర్మ పూజ
    సెప్టెంబర్ 19- ఆదివారం
    సెప్టెంబర్ 20- ఇంద్రజాత్ర
    సెప్టెంబర్ 21- శ్రీనారాయణ గురు సమాధి రోజు
    సెప్టెంబర్ 25- నాలుగో శనివారం
    సెప్టెంబర్ 26- ఆదివారం

    EPFO: ఉద్యోగం మారగానే ఈపీఎఫ్ అకౌంట్‌లో ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

    బ్యాంకులకు ప్రతీ నెలలో ఎన్ని సెలవులు ఉంటాయో, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంక్ హాలిడేస్ వివరాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published: