Bank Holidays September 2020: తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే...

Bank Holidays September 2020 | సెప్టెంబర్‌లో మీకు ముఖ్యమైన లావాదేవీలు ఏవైనా ఉన్నాయా? మరి సెప్టెంబర్‌లో బ్యాంకులు ఎప్పుడు మూసి ఉంటాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 31, 2020, 12:04 PM IST
Bank Holidays September 2020: తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే...
Bank Holidays September 2020: తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆగస్టులో సుమారు 10 రోజులు బ్యాంకులు పనిచేయలేదు. ఆగస్టులో ఎక్కువ సెలవులు వచ్చాయి. మరి సెప్టెంబర్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉంటే ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకొని మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకపోతే లావాదేవీల్లో జాప్యం జరగొచ్చు. సెప్టెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 6 రోజులు పనిచేయవు. ఇవన్నీ పబ్లిక్ హాలిడేసే. రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. వీటితో పాటు నాలుగు ఆదివారాలు బ్యాంకులకు సెలవులే. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇతర సెలవులేమీ లేవు.

Gold: మార్కెట్ రేట్ కన్నా రూ.3,000 తక్కువకే బంగారం... ఇదే ఆఖరి అవకాశం

Jan Dhan Yojana: జన్ ధన్ యోజన పథకానికి 6 ఏళ్లు... ఈ అకౌంట్‌తో లాభాలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల వివరాలివే...


సెప్టెంబర్ 6- ఆదివారం
సెప్టెంబర్ 12- రెండో శనివారం
సెప్టెంబర్ 13- ఆదివారంసెప్టెంబర్ 20- ఆదివారం
సెప్టెంబర్ 26- నాలుగో శనివారం
సెప్టెంబర్ 27- ఆదివారం

ఇక సెప్టెంబర్ 2న తిరువనంతపురం, కొచ్చి, గ్యాంగ్‌టక్, సెప్టెంబర్ 17న అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా, సెప్టెంబర్ 21న కొచ్చి, తిరువనంతపురంలో స్థానిక పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు. ఇవే కాకుండా బ్యాంకులకు ఏఏ నెలలో ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: August 31, 2020, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading