హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays in May: మేలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే... లిస్ట్ ఇదే

Bank Holidays in May: మేలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే... లిస్ట్ ఇదే

Bank Holidays in May: మేలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే... లిస్ట్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in May: మేలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే... లిస్ట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in May | మేలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 8 సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవు (Festival Holiday) కూడా వచ్చింది. ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి.

ఏప్రిల్‌లో బ్యాంకులకు అనేక సెలవులు వచ్చాయి. లాంగ్ వీకెండ్స్ (Long Weekends) కూడా వచ్చాయి. సాధారణ సెలవులు, పండుగలు కలిపి ఏప్రిల్‌లో మొత్తం 10 రోజులు బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేలో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఎక్కువగా రాలేదు. కేవలం రంజాన్ సందర్భంగా మాత్రమే సెలవు ఉంది. ఇది కాకుండా సాధారణంగా వచ్చే సెలవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 8 రోజులు తెరుచుకోవు. మీరు మేలో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేస్తున్నట్టైతే ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోవడం అవసరం. బ్యాంకుల హాలిడేస్‌ని బట్టి మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి.

Bank Holidays in May: మేలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల వివరాలివే


మే 1ఆదివారం
మే 3రంజాన్
మే 8ఆదివారం
మే 14రెండో శనివారం
మే 15ఆదివారం
మే 22ఆదివారం
మే 28నాలుగో శనివారం
మే 29ఆదివారం


LIC IPO: మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? ఎల్ఐసీ ఐపీఓలో పాలసీహోల్డర్లకు భారీ డిస్కౌంట్

ఈ హాలిడేస్ అన్నీ హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు మేలో సెలవులు ఉన్న తేదీలు. మేలో ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది. మే 3 మంగళవారం నాడు రంజాన్ సందర్భంగా సెలవు. మే 2 సోమవారం సెలవు తీసుకుంటే అంతకన్నా ముందు శనివారం, ఆదివారం సెలవులతో మొత్తం నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేయొచ్చు.

Bank Holidays in May: మేలో ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల వివరాలివే


 మే 1 ఆదివారం (దేశమంతా సెలవు)
 మే 2 రంజాన్ ఈద్ (కొచ్చి, తిరువనంతపురం రీజియన్లలో సెలవు)
 మే 3 రంజాన్ (దేశమంతా సెలవు)
 మే 8 ఆదివారం (దేశమంతా సెలవు)
 మే 9 రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (పశ్చిమ బెంగాల్ రీజియన్)
 మే 14  రెండో శనివారం (దేశమంతా సెలవు)
 మే 15 ఆదివారం (దేశమంతా సెలవు)
 మే 16 బుద్ధ పూర్ణిమ (త్రిపుర, బేలాపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్)
 మే 22 ఆదివారం (దేశమంతా సెలవు)
 మే 28 నాలుగో శనివారం (దేశమంతా సెలవు)
 మే 29 ఆదివారం (దేశమంతా సెలవు)


Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.11 లక్షల రిటర్న్స్

బ్యాంకులకు సెలవులు ఉన్నరోజు ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలన్నీ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఏటీఎం సేవలు కూడా లభిస్తాయి. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank, Bank Holidays, Banking, Holidays, Personal Finance

ఉత్తమ కథలు