లాక్డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత బ్యాంకుల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. మరి మీరు కూడా ముఖ్యమైన లావాదేవీలు ఏవైనా పెట్టుకున్నారా? జూలైలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకొని మీ లావాదేవీలను ప్లాన్ చేసుకుంటే మంచిది. వీలైనంత వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడమే మంచిది. అత్యవసరమైతే తప్ప బ్యాంకుకు వెళ్లకండి. ప్రతీ ఆదివారంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవే. ఇవి కాకుండా ఇతర సెలవులు కూడా ఉన్నాయి. మొత్తం 8 రోజులు బ్యాంకులు పనిచేయవు. మరి జూలైలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోండి.
Bank Holidays July 2020: జూలైలో బ్యాంకులకు సెలవులివే...
జూలై 5- ఆదివారం
జూలై 11- రెండో శనివారం
జూలై 12- ఆదివారం
జూలై 19- ఆదివారం
జూలై 20- బోనాల పండుగ (తెలంగాణ)
జూలై 25- నాలుగో శనివారం
జూలై 26- ఆదివారం
జూలై 31- బక్రీద్