రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 సెలవుల జాబితాను ప్రకటించింది. ఏ నెలలో ఏఏ సందర్భంగా బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉంటాయో వెల్లడించింది. రీజియన్ల వారీగా సెలవుల జాబితాను ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు జనవరిలో 8 సెలవులు వచ్చాయి. జనవరిలో సంక్రాంతి పండుగతో (Sankranti Festival) పాటు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అధికారిక సెలవులు ఉంటాయి. ఆ సెలవులు బ్యాంకులకు కూడా వర్తిస్తాయి. ఇవి కాకుండా సాధారణ సెలవులు ఉంటాయి.
నిత్యం బ్యాంకు లావాదేవీలు జరిపేవారు బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉంటాయో తెలుసుకోవడం అవసరం. ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు కస్టమర్లు తమ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. మరి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు జనవరిలో ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.
Aadhaar Card: పదేళ్ల క్రితం ఆధార్ తీసుకున్నారా? అయితే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి
జనవరి 1- ఆదివారం
జనవరి 8- ఆదివారం
జనవరి 14- రెండో శనివారం, భోగి
జనవరి 15- ఆదివారం, సంక్రాంతి
జనవరి 22- ఆదివారం
జనవరి 26- రిపబ్లిక్ డే
జనవరి 28- నాలుగో శనివారం
జనవరి 29- ఆదివారం
భోగి పండుగ రెండో శనివారం వచ్చింది. ఇక సంక్రాంతి పండుగ ఆదివారం వచ్చింది. కాబట్టి ఈ పండుగల సందర్భంగా వచ్చే సెలవులు సాధారణ సెలవుల్లో కలిసిపోయాయి. జనవరిలో ఈ 8 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. కాబట్టి ఆర్థిక లావాదేవీలు జరిపేవారు ఈ సెలవు రోజులు మినహాయించి ఇతర రోజుల్లో తమ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవచ్చు.
Account Transfer: ఆన్‌లైన్‌లోనే వేరే బ్రాంచ్‌కు ఎస్‌బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండిలా
బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని వాడుకోవచ్చు. ఈ సేవలు సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
జనవరిలో లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. లాంగ్ టూర్స్ ప్లాన్ చేసుకునేవారు లాంగ్ వీకెండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 1 ఆదివారం. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. ముందు రోజు శనివారం కాబట్టి, శనివారం సెలవు ఉన్నవారు, అంతకు ముందు రోజు డిసెంబర్ 30 శుక్రవారం, జనవరి 2 సోమవారం సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు.
PAN Card: పాన్ కార్డ్ విషయంలో ఊరట... బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ఇక జనవరి 14 రెండో శనివారం, భోగి పండుగ ఉన్నాయి. జనవరి 15 ఆదివారం సంక్రాంతి పండుగ ఉంది. జనవరి 13 శుక్రవారం, జనవరి 16 సోమవారం సెలవు తీసుకుంటే నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 26 గురువారం రిపబ్లిక్ డే సెలవు. జనవరి 28 శనివారం, జనవరి 29 ఆదివారం సెలవులు ఉన్నవారు జనవరి 27 లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల సెలవు ఎంజాయ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Holidays, Banking, Banking news, Personal Finance, Sankranti 2023