హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు 9 సెలవులు... హాలిడే లిస్ట్ ఇదే

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు 9 సెలవులు... హాలిడే లిస్ట్ ఇదే

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు 9 సెలవులు... హాలిడే లిస్ట్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు 9 సెలవులు... హాలిడే లిస్ట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays January 2022 | బ్యాంకులకు జనవరిలో 9 సెలవులు ఉన్నాయి. మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ (Banking Transactions) ప్లాన్ చేసుకునేముందు ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది రాబోయే సెలవుల జాబితాను ప్రకటించింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు రాబోయే సెలవుల వివరాలను ఆర్‌బీఐ ప్రకటించింది. హైదరాబాద్ సర్కిల్‌లో 2022 లో మొత్తం 17 సాధారణ సెలవులు వచ్చాయి. వీటితో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులు కూడా ఉంటాయి. ఇక జనవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9 సెలవులు వచ్చాయి. జనవరిలో సంక్రాంతి, రిపబ్లిక్ డే ఉంటాయి కాబట్టి సెలవులు ఎక్కువగానే ఉంటాయి. మరి జనవరిలో బ్యాంకులు ఏఏ రోజుల్లో తెరుచుకోవో తెలుసుకోండి.

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవుల వివరాలివే


 తేదీ సందర్భం
 జనవరి 2 ఆదివారం
 జనవరి 8 రెండో శనివారం
 జనవరి 9 ఆదివారం
 జనవరి 15 మకర సంక్రాంతి
 జనవరి 16 ఆదివారం
 జనవరి 22 నాలుగో శనివారం
 జనవరి 23 ఆదివారం
 జనవరి 26 రిపబ్లిక్ డే
 జనవరి 30 ఆదివారం


SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉన్నవారికి రూ.1,00,000 లోన్

జనవరిలో తెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు మొత్తం 9 సెలవులు ఉన్నాయి. వీటిలో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు సంక్రాంతి పండుగ, రిపబ్లిక్ డే సందర్భంగా సెలవులు ఉన్నాయి. జనవరి 8, 9, జనవరి 15, 16, జనవరి 22, 23 తేదీల్లో బ్యాంకులకు వరుసగా రెండు సెలవులు రావడం విశేషం. కాబట్టి బ్యాంకు కస్టమర్లు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి.

ఇతర రాష్ట్రాల్లో జనవరి 1 న్యూ ఇయర్, జనవరి 3 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, జనవరి 4 లోసూంగ్, జనవరి 11 మిషనరీ డే, జనవరి 12 స్వామి వివేకానంద జయంతి, జనవరి 14 పొంగల్, జనవరి 18 థాయ్ పూసమ్ సందర్భంగా వేర్వేరు రీజియన్లలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లో వర్తించవు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం జనవరి 15 మకర సంక్రాంతి, జనవరి 26 రిపబ్లిక్ డే సెలవులు మాత్రమే ఉన్నాయి.

Post Office Scheme: ఈ పథకంలో చేరితే ప్రతీ నెలా ఆదాయం... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలివే

బ్యాంకుకు తరచూ వెళ్లేవారు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలు జరపాలి. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే సెలవులతో సందర్భం లేకుండా నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. జనవరితో పాటు ఇతర నెలల్లో హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల వివరాలు తెలుసుకోవడానికి ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx చూడొచ్చు. హైదరాబాద్ రీజియన్ సెలెక్ట్ చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల వివరాలు తెలుస్తాయి.

First published:

Tags: Banking, Mobile Banking, Personal Finance, Reserve Bank of India

ఉత్తమ కథలు