హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in September 2022 | ఆగస్టులో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి. కానీ సెప్టెంబర్‌లో అన్ని సెలవులు లేవు. సెప్టెంబర్‌లో బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ప్లాన్ చేసుకుంటే ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మీకు సెప్టెంబర్‌లో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) ఉన్నాయా? బ్యాంకులో ఏవైనా లావాదేవీలు జరపాలా? మీరు ఎప్పుడు లావాదేవీలు ప్లాన్ చేసినా ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. ప్రతీ నెలా బ్యాంకులకు సాధారణంగా ఉండే సెలవులతో పాటు పండుగలు, ఇతర పర్వదినాలు ఉంటే ఆ రోజుల్లో కూడా హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు బ్యాంకుకు వెళ్లే పని ఉన్నా సెలవుల లిస్ట్ చెక్ చేయడం మంచిది. సెప్టెంబర్‌లో చూస్తే హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సాధారణ సెలవులు తప్ప ఇతర హాలిడేస్ ఏవీ లేవు. మరి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవుల జాబితా ఇదే...


సెప్టెంబర్ 4ఆదివారం
సెప్టెంబర్ 10రెండో శనివారం
సెప్టెంబర్ 11ఆదివారం
సెప్టెంబర్ 18ఆదివారం
సెప్టెంబర్ 24నాలుగో శనివారం
సెప్టెంబర్ 25ఆదివారం


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఈ 6 సెలవులు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ సాధారణ సెలవులే. ప్రతీ నెలలో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులు మూసి ఉంటాయన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో హైదరాబాద్ సర్కిల్‌లో పండుగలు, పర్వదినాలు ఏవీ లేకపోవడంతో ఇతర హాలిడేస్ లేవు. కానీ ఇతర సర్కిళ్లల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ సెలవుల జాబితా ఇక్కడ తెలుసుకోండి.

IRCTC Shirdi Tour: సాయిభక్తులకు గుడ్ న్యూస్... విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

ఇతర సర్కిళ్లలో బ్యాంకులకు సెలవుల జాబితా ఇదే...


 సెప్టెంబర్ 1 వినాయక చవితి రెండో రోజు (పనాజీ)
 సెప్టెంబర్ 4 ఆదివారం
 సెప్టెంబర్ 6 కర్మ పూజ (రాంచీ)
 సెప్టెంబర్ 7 ఫస్ట్ ఓనమ్ (కొచ్చి, తిరువనంతపురం)
 సెప్టెంబర్ 8 తిరువోనం (కొచ్చి, తిరువనంతపురం)
 సెప్టెంబర్ 9 ఇంద్రజాత్ర (గ్యాంగ్‌టక్)
 సెప్టెంబర్ 10 రెండో శనివారం
 సెప్టెంబర్ 11 ఆదివారం
 సెప్టెంబర్ 18 ఆదివారం
 సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి రోజు (కొచ్చి, తిరువనంతపురం)
 సెప్టెంబర్ 24 నాలుగో శనివారం
 సెప్టెంబర్ 25 ఆదివారం
 సెప్టెంబర్ 26 నవరాత్రి స్థాపన, మెరా చోరెన్ హౌబా (ఇంఫాల్, జైపూర్)


పైన ఉన్న జాబితాలో సాధారణ సెలవులు తప్ప ఇతర సెలవులేవీ హైదరాబాద్ సర్కిల్‌కు వర్తించవు. ఆదివారం, రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. కాబట్టి ఖాతాదారులు అందుకు అనుగుణంగా తమ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్ లాంటి సేవలు వాడుకోవచ్చు. ఈ సేవలన్నీ సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Holidays, Banking, Mobile Banking, Personal Finance, UPI

ఉత్తమ కథలు