హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 9 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 9 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 9 సెలవులు... ఎప్పుడెప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 9 సెలవులు... ఎప్పుడెప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in October | అక్టోబర్‌లో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ప్లాన్ చేసేవారికి అలర్ట్. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పండుగల సీజన్ మొదలైంది. దసరా నవరాత్రులు మొదలయ్యాయి. వచ్చే వారంలోనే దసరా పండుగ జరుపుకోనున్నారు ప్రజలు. పండుగల సీజన్ వచ్చిందంటే సెలవుల సీజన్ మొదలైనట్టే. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు (School Holidays) ప్రారంభమయ్యాయి. ఇక బ్యాంకులకు సెలవుల (Bank Holidays) విషయానికి వస్తే అక్టోబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో 9 సెలవులు వచ్చాయి. ఇందులోనే దసరా, దీపావళి సెలవులతో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఉన్నాయి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు ఎప్పుడు తెరుచుకోవో తెలుసుకోండి.

హైదరాబాద్ సర్కిల్‌లో అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు

అక్టోబర్ 2- ఆదివారం, గాంధీ జయంతి

అక్టోబర్ 5- విజయ దశమి

అక్టోబర్ 8- రెండో శనివారం

అక్టోబర్ 9- ఆదివారం

అక్టోబర్ 16- ఆదివారం

అక్టోబర్ 22- నాలుగో శనివారం

అక్టోబర్ 23- ఆదివారం

అక్టోబర్ 25- దీపావళి

అక్టోబర్ 30- ఆదివారం

దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 21 సెలవులు ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో బ్యాంకు లావాదేవీలు జరిపేవారు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకోవాలి.

Aadhaar Update: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... UIDAI నుంచి ముఖ్యమైన సలహా

దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు

అక్టోబర్ 1- బ్యాంక్ అకౌంట్స్ అర్థ సంవత్సర ముగింపు (గ్యాంగ్‌టక్)

అక్టోబర్ 2- ఆదివారం, గాంధీ జయంతి

అక్టోబర్ 3- దుర్గా పూజ (అగర్తలా, భువనేశ్వర్, గువాహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ)

అక్టోబర్ 4- మహా నవమి (అగర్తలా, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గువాహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం)

అక్టోబర్ 5- దసరా (ఇంఫాల్ తప్ప అన్ని సర్కిల్స్)

అక్టోబర్ 6, 7- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్)

అక్టోబర్ 8- రెండో శనివారం

అక్టోబర్ 13- కర్వా చౌత్ (షిమ్లా)

అక్టోబర్ 14- ఈద్ ఈ మిలాద్ ఉల్ నబీ (జమ్మూ, శ్రీనగర్)

అక్టోబర్ 18- కటి బిహు (గువాహతి)

అక్టోబర్ 24- కాళీ పూజ, నరక చతుర్దశి (అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్ , సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం)

అక్టోబర్ 25- దీపావళి (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్)

అక్టోబర్ 26- గోవర్ధన పూజ, భాయ్ దూజ్ (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్మూ, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్పూర్, సిమ్లా, శ్రీనగర్)

అక్టోబర్ 27- భాయ్ దూజ్ (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో)

అక్టోబర్ 31- సర్దార్ వల్లభ్ భాయ్ జయంతి, ఛాత్ పూజ (అహ్మదాబాద్, పాట్నా, రాంచీ)

Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? కొత్త రూల్స్ తెలుసుకోండి

ఆర్‌బీఐ ప్రతీ నెలా ఏ సర్కిల్‌లో ఎన్ని సెలవులు ఉంటాయో అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తుంది. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్ లాంటి సేవల్ని వాడుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Holidays, Banking, Holidays, Personal Finance

ఉత్తమ కథలు