దసరా, దీపావళి (Diwali) పండుగ సీజన్ ముగిసింది. సెలవుల సీజన్ కూడా ముగిసిపోయింది. అక్టోబర్‌లోనే పెద్ద పండుగలైన దసరా, దీపావళి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 9 సెలవులు (Bank Holidays) వచ్చాయి. ఇక ఇప్పట్లో పండుగలేమీ లేవు. కాబట్టి సెలవులు కూడా ఏమీ ఉండవు. నవంబర్‌లో బ్యాంకులకు ఒక ఫెస్టివల్ హాలిడే వచ్చింది. సాధారణంగా ఉండే సెలవులతో కలిపి మొత్తం 7 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. మీకు నవంబర్‌లో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉంటే సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోండి.
తేదీ | సందర్భం |
నవంబర్ 6 | ఆదివారం |
నవంబర్ 8 | కార్తీక పౌర్ణమి |
నవంబర్ 12 | రెండో శనివారం |
నవంబర్ 13 | ఆదివారం |
నవంబర్ 20 | ఆదివారం |
నవంబర్ 26 | నాలుగో శనివారం |
నవంబర్ 27 | ఆదివారం |
Diwali Bonus: దీపావళి బోనస్ ఏం చేస్తున్నారు? ఇలా దాచుకుంటే డబ్బులే డబ్బులు
తేదీ | సందర్భం |
నవంబర్ 1 | కన్నడ రాజ్యోత్సవ, కుట్ (బెంగళూరు, ఇంఫాల్) |
నవంబర్ 6 | ఆదివారం |
నవంబర్ 8 | కార్తీక పౌర్ణమి |
నవంబర్ 11 | కనకదాస జయంతి, వంగళ ఫెస్టివల్ (బెంగళూరు, షిల్లాంగ్) |
నవంబర్ 12 | రెండో శనివారం |
నవంబర్ 13 | ఆదివారం |
నవంబర్ 20 | ఆదివారం |
నవంబర్ 23 | సెంగ్ కుత్‌స్నెమ్ (షిమ్లా) |
నవంబర్ 26 | నాలుగో శనివారం |
నవంబర్ 27 | ఆదివారం |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకుల సెలవుల వివరాలు ఉంటాయి. ఏడాదిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉంటాయన్ని వివరాలను ఆర్‌బీఐ జనవరి మొదటి వారంలోనే వెల్లడిస్తుంది. ఏ నెలలో ఏ రీజియన్‌లో బ్యాంకులకు ఎన్ని హాలిడేస్ ఉంటాయో https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌లో తెలుసుకోవచ్చు.
Facts About Gold: బంగారం గురించి ఆసక్తికరమైన ఈ నిజాలు తెలుసా?
బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని వాడుకోవచ్చు. ఈ సేవలు సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Holidays, Banking, Banking news, Personal Finance