హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్, జూలైలో బ్యాంకులకు సెలవులు లేవు

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్, జూలైలో బ్యాంకులకు సెలవులు లేవు

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్, జూలైలో బ్యాంకులకు సెలవులు లేవు
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్, జూలైలో బ్యాంకులకు సెలవులు లేవు (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays | బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే ఖాతాదారులకు శుభవార్త. వరుసగా రెండు నెలలు బ్యాంకులకు ఎలాంటి పండుగ సెలవులు, ప్రత్యేక సెలవులు లేవు. కేవలం వారాంతపు సెలవులు (Weekend Holidays) మాత్రమే ఉన్నాయి. లావాదేవీలు ప్లాన్ చేయడానికి అదనంగా కొన్ని రోజులు లభించాయి.

ఇంకా చదవండి ...

బ్యాంకు ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం ఇది. బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ప్లాన్ చేసేప్పుడు బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకునేందుకు క్యాలెండర్ తిరగేస్తూ ఉంటారు. పండుగలు, ఇతర సందర్భాల్లో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉంటే ఆ రోజుల్లో లావాదేవీలు ప్లాన్ చేసుకోకుండా జాగ్రత్తపడతారు. కానీ జూన్, జూలై నెలల విషయానికి వస్తే కస్టమర్లకు ఈ అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌లో, జూలైలో బ్యాంకులకు ఎలాంటి పండుగ సెలవులు లేవు. కేవలం వీకెండ్‌లో వచ్చే సాధారణ సెలవులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి బ్యాంకు కస్టమర్లు సెలవుల గురించి టెన్షన్పడాల్సిన అవసరం లేదు. మరి బ్యాంకులకు ఏఏ రోజుల్లో సాధారణ సెలవులు వచ్చాయో తెలుసుకోండి.

జూన్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలివే...


జూన్ 5ఆదివారం
జూన్ 11రెండో శనివారం
జూన్ 12ఆదివారం
జూన్ 19ఆదివారం
జూన్ 25నాలుగో శనివారం
జూన్ 26ఆదివారం


PAN Card Rule: పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే

జూలైలో బ్యాంకులకు సెలవుల వివరాలివే...


జూలై 3ఆదివారం
జూలై 9రెండో శనివారం
జూలై 10ఆదివారం
జూలై 17ఆదివారం
జూలై 23నాలుగో శనివారం
జూలై 24ఆదివారం
జూలై 31ఆదివారంజూన్‌లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉన్నాయి. జూన్‌లో బ్యాంకులు మూసి ఉండేది 6 రోజులు మాత్రమే. దాదాపు దేశంలోని అన్ని రీజియన్లలో ఇవే సెలవులు ఉన్నాయి. జూన్ 2న షిమ్లా రీజియన్‌లో మహారాణ ప్రతాప్ జయంతి సందర్భంగా, జూన్ 15న ఐజ్వాల్, భువనేశ్వర్, జమ్మూ, శ్రీనగర్ రీజియన్‌లో వైఎంఏ డే, గురు హర్‌గోబింద్ పుట్టినరోజు, రాజ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉన్నాయి.

Indian Railways: రైళ్లల్లో ఒంటరిగా వెళ్లే మహిళలకు అలర్ట్... ఈ రూల్స్ తెలుసుకోండి

ఇక జూలైలో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు వీకెండ్ హాలిడేస్ వచ్చాయి. జూలైలో బ్యాంకులకు మొత్తం 7 సెలవులు వచ్చాయి. వరుసగా రెండు నెలలు బ్యాంకులకు ఎలాంటి పండుగ సెలవులు రాలేదు. కాబట్టి బ్యాంకు లావాదేవీలు జరిపే వారికి అదనంగా కొన్ని రోజులు కలిసి వచ్చాయి.

బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ ఓపెన్ చేసిన తర్వాత రీజనల్ ఆఫీస్, నెల సెలెక్ట్ చేస్తే సెలవుల వివరాలు తెలుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ సెలెక్ట్ చేయాలి. ఏ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకోవచ్చు.

ఇక బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ లావాదేవీలన్నీ 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: Bank Holidays, Banking, Mobile Banking, Personal Finance

ఉత్తమ కథలు