Home /News /business /

BANK HOLIDAYS IN JULY 2022 BANKS TO REMAIN CLOSED FOR 8 DAYS IN TWO TELUGU STATES FOR NEXT MONTH SEE FULL LIST HERE VB

Bank Holidays in July 2022: జూలై నెలలో బ్యాంకులకు 14 సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు(Holidays) రానున్నాయి. ఇది ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులన్నింటికీ వర్తించనుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు(Holidays) రానున్నాయి. ఇది ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులన్నింటికీ వర్తించనుంది. అయితే రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) క్యాలెండర్‌లోని సెలవులు(Holidays) దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఏకకాలంలో వర్తించవు. ఆయా రాష్ట్రాల్లోని పండగలు(Festivals), ప్రత్యేక సందర్భాలను బట్టి సెలవులుగా వేరుగా ఉంటాయి. కాబట్టి బ్యాంక్ కస్టమర్స్(Bank Customers) ఈ విషయాన్ని గమనించాలి. జూలై 9న బ‌క్రీద్ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా సెల‌వు ఉంటుంది. దీంతోపాటు ఐదు ఆదివారాలు, రెండు శ‌నివారాలు బ్యాంకుల‌కు సెల‌వులు ఉంటాయి. జూలైలో రెండు తెలుగు రాష్ట్రాల్లో(ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) వచ్చే సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IBPS Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 8,285 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి గడువు..


జూలై 2022లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవుల వివరాలిలా..

01) ఆదివారం, జూలై 3 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

02) శనివారం, జూలై 9- ఈద్-ఉల్-అద్హా (బక్రీద్)/ రెండవ శనివారం

03) ఆదివారం, జూలై 10- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

04) సోమవారం, జూలై 11- ఈద్-ఉల్-అజా

05) ఆదివారం, జూలై 17- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

06) శనివారం, జూలై 23- నాల్గవ శనివారం

07) ఆదివారం, జూలై 24 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

08) ఆదివారం, జూలై 31 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే



ఆయా ప‌ర్వ‌దినాలు, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల రీత్యా వివిధ రాష్ట్రాల్లో కొన్ని రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. జ‌మ్ము, శ్రీ‌న‌గ‌ర్‌ల‌లో జూలై 9-11 మ‌ధ్య మూడు రోజులు సెల‌వులు. 10న ఆదివారం, 11న ఈద్ ఉల్ అజా సంద‌ర్భంగా బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి..

Govt Internships: ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఈ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ లిస్ట్ మీకోసమే..!

జూలై 1: కాంగ్ (రథజాత్ర)/ రథ యాత్ర — భువనేశ్వర్
జూలై 3 : ఆదివారం (వారపు సెలవు)
జూలై 5: మంగళవారం - గురు హరగోవింద్ సింగ్ జీ ప్రకాష్ దివాస్ - జమ్మూ, కాశ్మీర్ బ్యాంక్ మూసివేస్తారు. జూలై 7 : ఖర్చి పూజ - అగర్తలాలో బ్యాంకులు మూసివేస్తారు.
జూలై 9 : శనివారం (నెలలో రెండవ శనివారం), ఈద్-ఉల్-అజా (బక్రీద్)
జూలై 10: ఆదివారం (వారపు సెలవు)
జూలై 11: ఈద్-ఉల్-అజా- జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.
జూలై 13: భాను జయంతి- గ్యాంగ్‌టక్ బ్యాంక్ మూసివేస్తారు.
జూలై 14: బెన్ డియెంక్లామ్ - షిల్లాంగ్ బ్యాంక్ మూసివేస్తారు.
జూలై 16: హరేలా - డెహ్రాడూన్ బ్యాంక్ మూసివేస్తారు.
జూలై 17: ఆదివారం (వారపు సెలవుదినం)
జూలై 23: శనివారం (నెల నాల్గవ శనివారం)
జూలై 24: ఆదివారం (వారపు సెలవు)
జూలై 31: ఆదివారం (వారపు సెలవు)
Published by:Veera Babu
First published:

Tags: Bank Holidays, Banking news, Banks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు