ఫిబ్రవరిలో బ్యాంకులో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) ప్లాన్ చేస్తున్నారా? అయితే అలర్ట్. ఫిబ్రవరిలో బ్యాంకులకు 7 సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ సెలవులతో పాటు శివరాత్రి సెలవు కూడా ఉంది. జనవరిలో 5 ఆదివారాలు, సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, శివరాత్రి సందర్భంగా సెలవులు వచ్చాయి. మరి ఏఏ తేదీల్లో బ్యాంకులు తెరుచుకోవో, మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోండి.
ఫిబ్రవరి 5- ఆదివారం
ఫిబ్రవరి 11- రెండో శనివారం
ఫిబ్రవరి 12- ఆదివారం
ఫిబ్రవరి 18- శివరాత్రి
ఫిబ్రవరి 19- ఆదివారం
ఫిబ్రవరి 25- నాలుగో శనివారం
ఫిబ్రవరి 26- ఆదివారం
Account Balance: అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా రూ.10,000 డ్రా చేయొచ్చు
ఫిబ్రవరిలో ఒక లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 18 శనివారం మహాశివరాత్రి. ఫిబ్రవరి 19 ఆదివారం సెలవు. ఫిబ్రవరి 17న శుక్రవారం సెలవు తీసుకుంటే మూడు రోజుల సెలవు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 18 శివరాత్రి శనివారం రోజు వచ్చింది కాబట్టి, ఫిబ్రవరిలో వరుసగా మూడు శనివారాలు బ్యాంకులు తెరుచుకోవన్న విషయాన్ని ఖాతాదారులు దృష్టిలో పెట్టుకోవాలి.
ఖాతాదారులు ఈ సెలవులు దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్ లాంటి సేవలు వాడుకోవచ్చు. ఈ సేవలన్నీ సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇక బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లో తెలుసుకోవచ్చు. ఈ లింక్‌లో సర్కిల్స్ వారీగా సెలవుల జాబితా ఉంటుంది.
SBI Account Transfer: మీ ఎస్‌బీఐ అకౌంట్ ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండిలా
ఫిబ్రవరిలో సెలవులు తక్కువే ఉన్నా, మార్చిలో బ్యాంకులకు సెలవులు ఎక్కువ ఉన్నాయి. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే కాకుండా, మార్చి 7న హోళీ, మార్చి 22న ఉగాది, మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా సెలవులు ఉన్నాయి. మార్చిలో మొత్తం 9 సెలవులు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Holidays, Banking, Banking news, Maha Shivaratri 2023