హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయంటే...

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయంటే...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in December | నవంబర్‌తో ఫెస్టివల్ సీజన్, సెలవుల సీజన్ అయిపోయింది. మరి డిసెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయి? తెలుసుకోండి.

డిసెంబర్ వచ్చేస్తోంది. ఈ ఏడాదిలో ఇక ఇదే ఆఖరు నెల. ఈ ఏడాది పూర్తి చేయాల్సిన బ్యాంకు లావాదేవీలను (Bank Transactions) డిసెంబర్‌లో ప్లాన్ చేసుకున్నారా? అయితే అలర్ట్. డిసెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవులు (Bank Holidays) ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. దీపావళితో నవంబర్‌లో పండుగ సీజన్ అయిపోయింది. డిసెంబర్‌లో క్రిస్మస్ తర్వాత మళ్లీ సంక్రాంతి సెలవుల సీజన్ మొదలవుతుంది. మరి మీరు ఈ డిసెంబర్‌లో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేయాలనుకుంటున్నారా? మరి డిసెంబర్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

Bank Holidays in December: డిసెంబర్‌లో బ్యాంకలకు సెలవులు ఎప్పుడంటే


డిసెంబర్ 5- ఆదివారం

డిసెంబర్ 11- రెండో శనివారం

డిసెంబర్ 12- ఆదివారం

డిసెంబర్ 19- ఆదివారం

డిసెంబర్ 25- నాలుగో శనివారం, క్రిస్మస్

డిసెంబర్ 26- ఆదివారం

Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... నేటి నుంచి పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మొత్తం 6 రోజులు తెరుచుకోవు. డిసెంబర్‌లో క్రిస్మస్ సెలవు మాత్రమే వచ్చింది. ఆ సెలవు కూడా నాలుగో శనివారంతో కలిసిపోయింది. దీంతో బ్యాంకులకు ప్రతీ నెలా సాధారణంగా ఉండే 6 సెలవులు మాత్రమే ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ ఫీస్ట్, డిసెంబర్ 18న యు సోసో థామ్ వర్ధంతి, డిసెంబర్ 24న, డిసెంబర్ 27న క్రిస్మస్ సంబరాలు, డిసెంబర్ 30న యు కియాంగ్ నాన్గ్‌బాహ్, డిసెంబర్ 31న కొత్త సంవత్స వేడుకల సందర్భంగా సెలవులు ఉన్నాయి.

IRCTC Araku Tour: అరకు టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ మీకోసమే

ఈ సెలవులేవీ తెలుగు రాష్ట్రాలకు వర్తించవు. కాబట్టి డిసెంబర్‌లో బ్యాంకులకు 6 రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే బ్యాంకులు తెరుచుకోవు. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజు ఖాతాదారులు నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకుల సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంకులకు ప్రతీ నెలలో ఎన్ని సెలవులు ఉంటాయో, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయో వివరాలు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంక్ హాలిడేస్ వివరాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేయాలి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Bank, Bank Holidays, Bank news, Banking, Christmas, Mobile Banking

ఉత్తమ కథలు