బ్యాంకులకు జూన్, జూలైలో సెలవులు రాలేదు. సాధారణంగా వీకెండ్‌లో వచ్చే సెలవులు (Weekend Holidays) తప్ప పండుగలు, పర్వదినాలు లేకపోవడంతో ఇతర హాలిడేస్ ఏమీ రాలేదు. కానీ ఆగస్టులో ఫెస్టివల్ సీజన్ మొదలవుతోంది. మొహర్రం, రాఖీపౌర్ణమి, కృష్ణాష్టమి, వినాయకచవితి ఆగస్టులోనే వచ్చాయి. దీంతో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆగస్టులో బ్యాంకులకు మొత్తం 10 సెలవులు వచ్చాయి. ఇందులో వీకెండ్‌లో వచ్చే సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆగస్టులో బ్యాంకులు ఏఏ రోజుల్లో తెరుచుకోవో తెలుసుకోండి.
ఆగస్ట్ 7 | ఆదివారం |
ఆగస్ట్ 9 | మొహర్రం |
ఆగస్ట్ 13 | రెండో శనివారం |
ఆగస్ట్ 14 | ఆదివారం |
ఆగస్ట్ 15 | ఇండిపెండెన్స్ డే |
ఆగస్ట్ 20 | కృష్ణాష్టమి |
ఆగస్ట్ 21 | ఆదివారం |
ఆగస్ట్ 27 | నాలుగో శనివారం |
ఆగస్ట్ 28 | ఆదివారం |
ఆగస్ట్ 31 | వినాయక చవితి |
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్... ఈ డెడ్‌లైన్ అస్సలు మర్చిపోవద్దు
ఆగస్ట్ 9న మొహర్రం సందర్భంగా సెలవు ఉంది. ఆగస్ట్ 12న రాఖీ పౌర్ణమి ఉన్నా హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు లేదు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఆగస్ట్ 18, 19న కృష్ణాష్టమి సెలవులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ సర్కిల్‌లో కృష్ణాష్టమి సెలవు ఆగస్ట్ 20న వచ్చింది. మొత్తం కలిపి ఆగస్టులో బ్యాంకులకు 10 సెలవులు వచ్చాయి. ఆగస్ట్ 31న వినాయక చవితి సందర్భంగా సెలవు.
ఆగస్టులో ఓ లాంగ్ వీకెండ్ కూడా ఉంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కూడా సోమవారం వచ్చింది. అంతకన్నా ముందు రెండో శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. శుక్రవారం రాఖీ పౌర్ణమి ఉన్నా సెలవు లేదు. శుక్రవారం సెలవు పెట్టుకుంటే వరుసగా నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు.
SBI Alert: ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్
బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లింక్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. రీజనల్ ఆఫీస్ వారీగా సెలవుల వివరాలు ఉంటాయి. హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల సెలవుల వివరాలు తెలుస్తాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ లావాదేవీలన్నీ 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.