మళ్లీ సెలవుల సందడి మొదలైంది. ఏప్రిల్‌లో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకునేవారు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణ సెలవులతో (General Holidays) పాటు ఇతర సందర్భాల్లో సెలవులు కూడా ఉన్నాయి. ప్రతీ నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు ఎలాగూ బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉంటాయి. ఇవి కాకుండా ఏప్రిల్‌లో మరో 5 సెలవులు వచ్చాయి. అందులో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి, రంజాన్ సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి ఏప్రిల్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి.
ఏప్రిల్ 1- ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్
ఏప్రిల్ 2- ఆదివారం
ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి
ఏప్రిల్ 7- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 8- రెండో శనివారం
ఏప్రిల్ 9- ఆదివారం
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 16- ఆదివారం
ఏప్రిల్ 22- నాలుగో శనివారం, రంజాన్
ఏప్రిల్ 23- ఆదివారం
ఏప్రిల్ 30- ఆదివారం
Railway Charges: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఆ టికెట్ ఛార్జీల తగ్గింపు
ఏప్రిల్‌లో మొత్తం 11 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. ఈసారి ఏప్రిల్‌లో ఐదు ఆదివారాలు వచ్చాయి. ఏప్రిల్ 1 శనివారం కావడంతో ఏప్రిల్‌లో మూడు శనివారాలు బ్యాంకులు తెరుచుకోవు. ఏప్రిల్‌లో లాంగ్ వీకెండ్స్ కూడా వచ్చాయి. ఏప్రిల్ 7 శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 8 రెండో శనివారం, ఏప్రిల్ 9 ఆదివారం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా సెలవు. ఏప్రిల్ 6న సెలవు తీసుకుంటే వరుసగా 5 రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు. ఏప్రిల్ 15న సెలవు తీసుకుంటే ఏప్రిల్ 16న ఆదివారం సెలవు. వరుసగా మూడు రోజులు సెలవు ఎంజాయ్ చేయొచ్చు.
Indian Railways: రైలు మిస్ అయితే అదే టికెట్‌పై మరో రైలు ఎక్కొచ్చు... కానీ ఓ కండీషన్
బ్యాంకులకు ఏ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ వెబ్‌సైట్‌లో హైదరాబాద్ రీజియన్, నెల సెలెక్ట్ చేస్తే సెలవుల వివరాలు కనిపిస్తాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజు కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Holidays, Banking, Personal Finance