Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంక్‌లకి వరుసగా సెలవులు.. లావాదేవీలు ముందే ప్లాన్ చేసుకోండి..

ఏప్రిల్ నెలలో బ్యాంకులకి వరుస సెలవులు ఉన్నాయి. కాబట్టి డిపాజిట్లు, డీడీలు జమా చేయడం వంటి లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోండి.

Amala Ravula | news18-telugu
Updated: April 2, 2019, 11:53 AM IST
Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంక్‌లకి వరుసగా సెలవులు.. లావాదేవీలు ముందే ప్లాన్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 2, 2019, 11:53 AM IST
ఈ నెలలో బ్యాంకు లావాదేవీలు వంటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే పండుగల కారణంగా వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాలు, చెక్స్ డిపాజిట్స్, డీడీలు జమా చేయడం వంటివి ముందుగానే చేయడం ఉత్తమం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, నాలుగో శనివారాలు అంటే ఏప్రిల్ 13, 27 తేదీలు బ్యాంక్స్ క్లోజ్. వీటికి జతగా ఆదివారాలు 1, 14, 21, 28 తేదీలు సెలవు. వీటితో పాటు ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న శనివారం, 7ఆదివారం మూడురోజులు వరుసగా సెలవులు. 19న గుడ్‌ఫ్రైడే కాబట్టి సెలవు. ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.
అయితే, నెట్ బ్యాంకింగ్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆన్‌లైన్, డిజిటల్ లావాదేవీలు జరుగుతాయి. కాబట్టి ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా సేవలు వినియోగించుకోవచ్చు. మిగతా లావాదేవి వ్యవహారాలు సెలవులకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

First published: April 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...