BANK HOLIDAYS FEBRUARY 2022 BANKS WILL REMAINED CLOSED 12 DAYS NEXT MONTH CHECK HERE FOR LIST OF BANK HOLIDAYS SS
Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే...
Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే...
(ప్రతీకాత్మక చిత్రం)
Bank Holidays | ఫిబ్రవరిలో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ప్లాన్ చేసుకున్నారా? అయితే ఫిబ్రవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో? ఏ రోజున మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోండి.
మీకు ఫిబ్రవరిలో ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే అలర్ట్. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉన్నాయో తెలుసుకోండి. బ్యాంకులు తెరిచి ఉన్న రోజే మీ ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) ప్లాన్ చేసుకోండి. సాధారణంగా బ్యాంకులకు ప్రతీ ఆదివారం సెలవు ఉంటుంది. దీంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవే. కాబట్టి బ్యాంకులకు ప్రతీ నెలలో ఆరు లేదా ఏడు సెలవులు వస్తాయి. ఫిబ్రవరిలో 28 రోజులు ఉన్నాయి కాబట్టి ఆరు సెలవులు వచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా చూస్తే బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి. ఆ సెలవుల వివరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు వచ్చాయో తెలుసుకోండి.
ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...
ఫిబ్రవరిలో హైదరాబాద్ రీజియన్లో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...
తేదీ
సందర్భం
ఫిబ్రవరి 6
ఆదివారం
ఫిబ్రవరి 12
రెండో శనివారం
ఫిబ్రవరి 13
ఆదివారం
ఫిబ్రవరి 20
ఆదివారం
ఫిబ్రవరి 26
నాలుగో శనివారం
ఫిబ్రవరి 27
ఆదివారం
హైదరాబాద్ రీజియన్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో బ్యాంకులకు ఫిబ్రవరిలో సాధారణంగా ఉండే సెలవులే వచ్చాయి. ఎలాంటి పండుగలు ప్రత్యేక రోజులు లేవు కాబట్టి ఇతర సెలవులు లేవు. మార్చి 1న మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకులకు సెలవులు కాబట్టి ఫిబ్రవరి 28 రోజున సెలవు పెట్టుకుంటే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 26 నాలుగో శనివారం, ఫిబ్రవరి 27 ఆదివారం వచ్చాయి.
బ్యాంకుల సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హైదరాబాద్ రీజియన్, నెల సెలెక్ట్ చేస్తే సెలవుల వివరాలు కనిపిస్తాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజు కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.