హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays in April: ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు... హాలిడేస్ లిస్ట్ ఇదే

Bank Holidays in April: ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు... హాలిడేస్ లిస్ట్ ఇదే

Bank Holidays in April | ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌లో మీకు బ్యాంకుకు వెళ్లాల్సిన పనులు (Bank Transactions) ఉన్నాయా? అయితే అలర్ట్. ఏప్రిల్‌లో బ్యాంకులకు 10 రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పుడో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ఏప్రిల్ వచ్చేస్తోంది. ఏప్రిల్ వచ్చిందంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్‌లో మీరు బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే అలర్ట్. ఏప్రిల్‌లో బ్యాంకులకు చాలా సెలవులు (Bank Holidays) వచ్చాయి. సాధారణంగా వచ్చే సెలవులతో పాటు పండుగ సెలవులు కూడా ఉన్నాయి. మొత్తం కలిపి బ్యాంకులకు 10 రోజులు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 1న ఇయర్లీ క్లోజింగ్ కాబట్టి బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో లభించవు. మరి మీరు లావాదేవీలు ప్లాన్ చేసుకునే ముందు ఈ సెలవుల జాబితా తెలుసుకోవడం అవసరం. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌లో ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయి? బ్యాంకులు ఏ రోజుల్లో తెరుచుకుంటాయో తెలుసుకోండి.

Bank Holidays in April: తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల వివరాలివే

 ఏప్రిల్ 1 ఇయర్లీ క్లోజింగ్
 ఏప్రిల్ 2 ఉగాది
 ఏప్రిల్ 3 ఆదివారం
 ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, మహావీర్ జయంతి
 ఏప్రిల్ 9 రెండో శనివారం
 ఏప్రిల్ 10 ఆదివారం
 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి
 ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే
 ఏప్రిల్ 17 ఆదివారం
 ఏప్రిల్ 23 రెండో శనివారం
 ఏప్రిల్ 24 ఆదివారం

Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌హోల్డర్లకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

ఏప్రిల్ 1న ఇయర్లీ క్లోజింగ్ డే బ్యాంకింగ్ సేవలు తక్కువగానే అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 3న ఆదివారం, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య బ్యాంకులో పూర్తి స్థాయి సేవలు లభించేది ఏప్రిల్ 4న మాత్రమే. ఏప్రిల్ 9 రెండో శనివారం, ఏప్రిల్ 10 ఆదివారం సందర్భంగా వరుసగా రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే సందర్భంగా బ్యాంకులకు సెలవుల. ఏప్రిల్ 16న బ్యాంకులు పనిచేస్తాయి. ఏప్రిల్ 17న ఆదివారం సందర్భంగా సెలవు. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 మధ్య నాలుగు రోజుల్లో కేవలం ఒక రోజు మాత్రమే పనిచేస్తాయి. ఇక ఏప్రిల్ 23న రెండో శనివారం, ఏప్రిల్ 24న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.

New Rules: అలర్ట్... ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

ఇవన్నీ హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులకు మరిన్ని సెలవులు ఉన్నాయి. రాంచీ సర్కిల్‌లో ఏప్రిల్ 4న సర్హుల్, గువాహతి సర్కిల్‌లో ఏప్రిల్ 16న బొహగ్ బిహు, అగర్తలా సర్కిల్‌లో ఏప్రిల్ 21న గరియా పూజ, జమ్మూ, శ్రీనగర్ సర్కిల్‌లో ఏప్రిల్ 29న జుమాత్ అల్ విదా సందర్భంగా సెలవులు ఉన్నాయి.

First published:

Tags: Bank Holidays, Banking, Personal Finance

ఉత్తమ కథలు