Bank Holidays 2020: బ్యాంకు సెలవుల్ని ప్రకటించిన ఆర్‌బీఐ... 2020 హాలిడేస్ వివరాలివే

Bank Holidays 2020 | మీరు తరచూ బ్యాంకులకు వెళ్తున్నట్టైతే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి 2020 సంవత్సరంలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు అధికారికంగా సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: December 25, 2019, 6:18 PM IST
Bank Holidays 2020: బ్యాంకు సెలవుల్ని ప్రకటించిన ఆర్‌బీఐ... 2020 హాలిడేస్ వివరాలివే
Bank Holidays 2020: బ్యాంకు సెలవుల్ని ప్రకటించిన ఆర్‌బీఐ... 2020 హాలిడేస్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వచ్చే ఏడాది బ్యాంకు సెలవుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజనల్ ఆఫీస్ పరిధుల్లో బ్యాంకులకు ఏఏ రోజులో సెలవు ఉంటుందో వివరించింది. 2020 లో బ్యాంకులకు మొత్తం 20 సెలవులు ఉన్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. మీరు తరచూ బ్యాంకులకు వెళ్తున్నట్టైతే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి 2020 సంవత్సరంలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు అధికారికంగా సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

2020 Bank Holidays: 2020 సంవత్సరంలో బ్యాంకులకు సెలవులివే...



జనవరి 15- సంక్రాంతి
ఫిబ్రవరి 21- మహాశివరాత్రి
మార్చి 9- హోలీ
మార్చి 25- ఉగాది
ఏప్రిల్ 1- యాన్యువల్ క్లోజింగ్ఏప్రిల్ 2- శ్రీరామనవమి
ఏప్రిల్ 10- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
మే 1- మే డే
మే 25- రంజాన్
ఆగస్ట్ 1- బక్రీద్
ఆగస్ట్ 11- శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే
ఆగస్ట్ 22- వినాయక చవితి
అక్టోబర్ 2- గాంధీ జయంతి
అక్టోబర్ 24- దసరా
అక్టోబర్ 30- మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 14- దీపావళి
నవంబర్ 30- గురునానక్ జయంతి
డిసెంబర్ 25- క్రిస్మస్

ఈ సెలవులు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌ పరిధిలోని బ్యాంకులకు వర్తిస్తాయి. ఇతర రీజనల్ ఆఫీస్‌లల్లో 2020 సంవత్సరంలో బ్యాంకుల సెలవుల వివరాలు తెలుసుకోవాలంటే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు... టైమింగ్స్ ఇవే

EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా

Sukanya Samriddhi Rules 2019: సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం
Published by: Santhosh Kumar S
First published: December 25, 2019, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading