బ్యాంకులకు 3 నెలల్లో 30 రోజులు సెలవు.. పూర్తి జాబితా ఇదే

సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుంటే.. అందుకు అనుగణంగా కస్టమర్లు ప్లాన్ చేసుకోవచ్చు. మరి జూన్ నుంచి ఆగస్టు వరకు బ్యాంకులకు సెలవులు ఎప్పుడో ఇక్కడ చూడండి.

news18-telugu
Updated: May 26, 2020, 10:12 PM IST
బ్యాంకులకు 3 నెలల్లో 30 రోజులు సెలవు.. పూర్తి జాబితా ఇదే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్‌లో నిత్యావసర అన్నీ కార్యాలయాలు మూతపడ్డాయి. ఐతే లాక్‌డౌన్‌ 4లో సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడు చాలా వరకు దుకాణాలు, ఆఫీసులు కూడా తెరచుకున్నాయి. కానీ లాక్‌డౌన్‌లోనూ బ్యాంకులు పనిచేశాయి. పనివేళల్లో మార్పులు ఉన్నప్పటికీ అన్ని బ్యాంకులూ పనిచేశాయి. కరోనా కాలంలోనూ వినియోగదారులకు సేవలందించాయి. ఐతే రాబోయే మూడు నెలల్లో 30 రోజులు బ్యాంకులకు సెలవువు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం జూన్, జులై, ఆగస్టులో శని, ఆదివారాలతో పాటు పండగలు కలుపుకుంటే దాదాపు 30 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అందుకే సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుంటే.. అందుకు అనుగణంగా కస్టమర్లు ప్లాన్ చేసుకోవచ్చు. మరి జూన్ నుంచి ఆగస్టు వరకు బ్యాంకులకు సెలవులు ఎప్పుడో ఇక్కడ చూడండి.

జూన్: శని ఆదివారాల కారణంగా జూన్ 7, 13, 14, 17, 23, 24, 31 రోజులలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటితో పాటు జూన్ 18న గురు హర్ గోబింద్ జీ జయంతి వలన చాలా రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది..

జులై: శని ఆదివారాల కారణంగా జులై 5, 11, 12, 19, 25, 26 రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటితో పాటు జులై 31న బక్రీద్ వలన మరో సెలవు వచ్చింది.

ఆగస్టు: శని ఆదివారాల కారణంగా ఆగస్టు 2, 8, 9, 16, 22, 23, 29, 30 రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటితో పాటు ఆగస్టు 3న రక్షాబంధన్, 11న శ్రీక్రిష్ణ జన్మాష్టమి స్థానిక సెలవు, 12న శ్రీ కృష్ణ జన్మాష్టమి గెజిటెడ్ హాలీడే, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 21న తీజ్ లోకల్ హాలిడే, 22న వినాయక చవితి, 30న మొహర్రం గెజిటెడ్ హాలీడే, ఆగస్టు 31న ఓనమ్ లోకల్ హాలీడే ఉంటుంది.
First published: May 26, 2020, 10:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading