హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays in November: నవంబర్‌లో బ్యాంకులకు 17 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

Bank Holidays in November: నవంబర్‌లో బ్యాంకులకు 17 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

Bank Holidays in November: నవంబర్‌లో బ్యాంకులకు 17 సెలవులు... ఎప్పుడెప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in November: నవంబర్‌లో బ్యాంకులకు 17 సెలవులు... ఎప్పుడెప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays in November | నవంబర్‌లో ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు (Banking Transactions) ప్లాన్ చేసుకున్నారా? అయితే అలర్ట్. నవంబర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 17 బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్యాంకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ కొనసాగుతోంది. వినాయక చవితితో మొదలైన పండుగ సీజన్ (Festival Season) సంక్రాంతి వరకు కొనసాగుతుంది. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి లాంటి పండుగలు, పర్వదినాలు ప్రతీ నెలా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఫెస్టివల్ సీజన్‌లో సెలవులు కూడా ఎక్కువే. నవంబర్‌లో కూడా సెలవులు వచ్చాయి. మరి నవంబర్‌లో మీకు బ్యాంకు పనులు ఏవైనా ఉన్నాయా? ముఖ్యమైన లావాదేవీలు ప్లాన్ చేసుకున్నారా? దేశవ్యాప్తంగా బ్యాంకులకు 17 సెలవులు (Bank Holidays) వచ్చాయి. ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. ఒక రాష్ట్రంలోని వ్యాపారులు మరో రాష్ట్రంలోని వ్యాపారులతో లావాదేవీలు జరుపుతుంటారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సెలవుల వివరాలు తెలుసుకోకతప్పదు. మరి అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన సెలవులు ఎన్ని? ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి.

Aadhaar-Ration card linking: మీ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...


 నవంబర్ 1 కన్నడ రాజ్యోత్సవ, కుట్ (బెంగళూరు, ఇంఫాల్)
నవంబర్ 3 నరక చతుర్దశి (బెంగళూరు)
 నవంబర్ 4 దీపావళి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)
 నవంబర్ 5 దీపావళి, బలి ప్రతిపాద, విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే, గోవర్ధన పూజ (అహ్మదాబాద్, బెలాపూర్, బెంగళూరు, డెహ్రడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, కాన్‌పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్)
 నవంబర్ 6 భాయ్ దుజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ, దీపావళి, నింగోల్ చక్కౌబా (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్‌పూర్, లక్నో, షిమ్లా)
 నవంబర్ 7 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
 నవంబర్ 10 ఛాత్ పూజ, సూర్య పస్థి దళ ఛాత్ (పాట్నా, రాంచీ)
 నవంబర్ 11 ఛాత్ పూజ (పాట్నా)
 నవంబర్ 12 వంగల ఫెస్టివల్ (షిల్లాంగ్)
 నవంబర్ 13 రెండో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)
 నవంబర్ 14 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
 నవంబర్ 19 గురునానక్ జయంతి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)
 నవంబర్ 21 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
 నవంబర్ 22 కనకదాస జయంతి (బెంగళూరు)
 నవంబర్ 23 సెంగ్ కుత్స్‌నెమ్ (షిల్లాంగ్)
 నవంబర్ 27 నాలుగో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)
 నవంబర్ 28 ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)


Post Office Franchise: కేవలం రూ.5,000 చెల్లిస్తే పోస్ట్ ఆఫీస్ ఫ్లాంఛైజ్... కమిషన్ ఎంత వస్తుందంటే

హైదరాబాద్ రీజియన్‌లో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...


నవంబర్ 4దీపావళి
నవంబర్ 7ఆదివారం
నవంబర్ 13రెండో శనివారం
నవంబర్ 14ఆదివారం
నవంబర్ 19గురునానక్ జయంతి
నవంబర్ 21ఆదివారం
నవంబర్ 27నాలుగో శనివారం
నవంబర్ 28ఆదివారం


SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... కేవలం రూ.342 చెల్లిస్తే రూ.4,00,000 బెనిఫిట్

హైదరాబాద్ రీజియన్‌లో నవంబర్‌లో 8 సెలవులు వచ్చాయి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో బ్యాంకులు 8 రోజులు తెరుచుకోవు. అందులో 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది. రీజియన్ల వారీగా సెలవుల వివరాలను https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌లో తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Holidays, Bank news, Banking, Personal Finance

ఉత్తమ కథలు