Home /News /business /

BANK HOLIDAY IN JANUARY 2022 THESE ARE THE BANK HOLIDAYS IN THE NEW YEAR JANUARY MK

Bank Holiday in January 2022: కొత్త సంవత్సరం జనవరిలో బ్యాంకు సెలవలు ఇవే...బ్యాంకు పనులుంటే ప్లాన్ చేసుకోండిలా...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బ్యాంకింగ్‌కు సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు రానున్నాయి. ఇది సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అయితే బ్యాంకు సెలవుల కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వచ్చే నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడబోతున్నాయి.

ఇంకా చదవండి ...
    Bank Holiday in January 2022: కొత్త సంవత్సరం వస్తోంది. దీంతో చాలా విషయాలు మారబోతున్నాయి. జనవరి 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. బ్యాంకింగ్‌కు సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు రానున్నాయి. ఇది సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అయితే బ్యాంకు సెలవుల కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వచ్చే నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ జాబితా ప్రకారం, జనవరిలో వారాంతపు సెలవులతో పాటు 9 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. వీటిలో కొన్ని సెలవులు దేశం మొత్తానికి , కొన్ని సెలవులు స్థానికంగా ఉంటాయి. తమాషా ఏంటంటే.. జనవరి, కొత్త సంవత్సరం ప్రారంభం సెలవులతోనే మొదలవుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.

    PPF Account: పోస్టాఫీసులో పీపీఎఫ్​ అకౌంట్ ఓపెన్​ చేయాలా.. అయితే ఆన్​లైన్​లో ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి..


    కొత్త సంవత్సరం సెలవులతో ప్రారంభమవుతుంది

    బ్యాంకుల్లో జాతీయ సెలవులు కాకుండా, రాష్ట్రాల ప్రకారం ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా, ప్రతి ఆదివారం , రెండవ , నాల్గవ శనివారం కూడా బ్యాంకుల పని మూసివేయబడుతుంది. సంవత్సరంలో మొదటి తేదీ శనివారం, కానీ ఈ రోజు నూతన సంవత్సర సెలవుదినం. దీని తర్వాత రెండో రోజు అంటే జనవరి 2 ఆదివారం వస్తోంది.

    Home Loan: హోంలోన్ త్వరగా రావాలంటే.. ఈ విషయాలపై దృష్టి పెట్టండి..


    జనవరిలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా:

    జనవరి 1: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సెలవుదినం.

    జనవరి 2: ఆదివారం.

    జనవరి 4: లుసంగ్ కారణంగా సిక్కింలో బ్యాంకులు మూసివేయబడతాయి.

    8 జనవరి: రెండవ శనివారం.

    9 జనవరి: ఆదివారం.

    జనవరి 11: మిషనరీ డే (మిజోరం)

    జనవరి 12: స్వామి వివేకానంద జయంతి.

    జనవరి 14: మకర సంక్రాంతి / పొంగల్ (చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి).

    15 జనవరి: ఉత్తరాయణ, మాఘే సంక్రాంతి, సంక్రాంతి పొంగల్, తిరువళ్లూరు రోజు (పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు).

    16 జనవరి: ఆదివారం.

    జనవరి 18: తై పూసం (తమిళనాడు).

    జనవరి 22: నాల్గవ శనివారం.

    23 జనవరి: ఆదివారం.

    జనవరి 26: గణతంత్ర దినోత్సవం.

    30 జనవరి: ఆదివారం.

    31 జనవరి: మే-డ్యామ్-మీ-ఫై (అస్సాం).
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bank, Bank Holidays

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు