హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates: ఎఫ్‌డీ రేట్లు సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ.. తాజా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

FD Rates: ఎఫ్‌డీ రేట్లు సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ.. తాజా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

FD Rates: ఎఫ్‌డీ రేట్లు సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ.. తాజా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

FD Rates: ఎఫ్‌డీ రేట్లు సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ.. తాజా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Fixed Deposit | చాలా మంది డబ్బు ఇన్వెస్ట్‌ చేయడానికి బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సురక్షితంగా భావిస్తారు. ఇటీవల హెచ్‌‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకులు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై ఈ మూడు బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Bank News | చాలా మంది డబ్బు ఇన్వెస్ట్‌ చేయడానికి బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సురక్షితంగా భావిస్తారు. స్థిరమైన రాబడి అందుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఆయా బ్యాంకుల ఎఫ్‌డీ  (FD) వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇటీవల హెచ్‌‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకులు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై ఈ మూడు బ్యాంకులు (Banks) అందిస్తున్న వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

7- 14 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ , ఐసీఐసీఐ బ్యాంకులు 3 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. 15- 29 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు మూడు బ్యాంకులు 3 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. 30- 45 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ 3.50 శాతం, ఎస్‌బీఐ 3 శాతం వడ్డీని ఇస్తున్నాయి. 46- 60 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ 4.50 శాతం, ఐసీఐసీఐ 4 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 61- 89 రోజుల ఎఫ్‌డీలపై మూడు బ్యాంక్‌లు 4.50 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి.

రూ.1,700కే విమాన టికెట్.. రిపబ్లిక్ డే ఆఫర్ అదుర్స్!

90 రోజులు- 6 నెలల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు హెచ్‌డీఎఫ్‌సీ 4.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ 91 రోజుల నుంచి 179 రోజుల వాటిపై 4.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 91 రోజుల నుంచి 184 రోజుల వాటిపై 4.75 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఆరు నెలల ఒక రోజు నుంచి తొమ్మిది నెలల లోపు ఎఫ్‌డీలకు హెచ్‌డీఎఫ్‌సీ 5.75 శాతం, ఎస్‌బీఐ 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై 5.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 185 రోజుల నుంచి 289 రోజుల ఎఫ్‌డీలపై 5.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.

ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి భారీ శుభవార్త!

తొమ్మిది నెలల ఒక రోజు నుంచి సంవత్సరం‌లోపు ఎఫ్‌డీలపై హెచ్‌డీఎఫ్‌సీ 6 శాతం, ఎస్‌బీఐ 211 రోజుల నుంచి ఒక సంవత్సరంలోపు ఎఫ్‌డీలపై 5.75 శాతం, ఐసీఐసీఐ 290 రోజుల నుంచి సంవత్సరం లోపు ఎఫ్‌డీలపై 5.75 శాతం ఆఫర్ చేస్తున్నాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు ఎఫ్‌డీలపై హెచ్‌డీఎఫ్‌సీ సాధారణ ప్రజలకు 6.50 శాతం, ఎస్‌బీఐ ఒక సంవత్సరం నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఐసీఐసీఐ ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు వాటిపై 6.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

15 నెలల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు హెచ్‌డీఎఫ్‌సీ 7 శాతం, 2- 3 ఏళ్లకు ఎస్‌బీఐ 6.75 శాతం, 15 నెలల నుంచి మూడేళ్ల వరకు ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. 3- 5 ఏళ్ల ఎఫ్‌డీలపై హెచ్‌డీఎఫ్‌సీ 7 శాతం, ఎస్‌‌బీఐ 6.25 శాతం, ఐసీఐసీఐ 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 5- 10 ఏళ్ల ఎఫ్‌డీపై హెచ్‌డీఎఫ్‌సీ 7 శాతం, ఎస్‌బీఐ 6.25 శాతం, ఐసీఐసీఐ 6.90 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ మూడు బ్యాంకులు కనిష్టంగా 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న వివిధ ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 0.50 వడ్డీ రేట్‌ను ఆఫర్ చేస్తున్నాయి.

SBI Wecare డిపాజిట్ స్కీమ్ వివరాలు

ఈ డిపాజిట్ స్కీమ్ కింద 5- 10 ఏళ్ల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 1.00 శాతం వడ్డీ లభిస్తుంది. SBI Wecare డిపాజిట్ స్కీమ్ 2023 మార్చి 31 వరకు పొడిగించారు.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits, HDFC bank, Icici bank, Personal Finance, Sbi

ఉత్తమ కథలు