Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్...

March 2020 Bank Holidays | సమ్మె ఉండేది మూడు రోజులే అయినా మార్చి 10 నుంచి 15 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలకు బ్రేక్ పడ్డట్టే.

news18-telugu
Updated: February 25, 2020, 2:23 PM IST
Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్...
Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు బ్యాంకులో తప్పనిసరిగా జరపాల్సిన లావాదేవీలు ఏవైనా ఉన్నాయా? మార్చిలో ఏవైనా ముఖ్యమైన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేశారా? అయితే మీ లావాదేవీలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో తరచూ బ్యాంకులకు వెళ్లేవారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లక్షలాది మంది ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. మార్చి రెండో వారంలో వరుసగా మూడు రోజులు సమ్మెకు దిగనున్నారు. దీంతో ఆ మూడు రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించడం ఖాయం. అంతేకాదు... సమ్మెకు ముందు రోజు హోళీ పండుగ, సమ్మె తర్వాత రెండోశనివారం, ఆదివారం కూడా రావడంతో వరుసగా ఆరు రోజులు బ్యాంకులు మూతపడ్డట్టే. బ్యాంకులు మాత్రమే కాదు... ఏటీఎంలో లావాదేవీలకు సైతం అంతరాయం తప్పదు.

వేతనాల పెంపు అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-BEFI, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA మార్చి 11 నుంచి 13 వరకు దేశవ్యాప్త సమ్మె నిర్వహించబోతున్నాయి. హోళీ తర్వాత, రెండో శనివారానికి మధ్య వచ్చే మూడు మూడు రోజులు సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించాయి బ్యాంకు యూనియన్లు. దీంతో మార్చి 10న హోళీ పండుగ, 11 నుంచి 13 వరకు సమ్మె, మార్చి 14న రెండో శనివారం, మార్చి 15న ఆదివారంతో కలిపి 6 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. సమ్మె ఉండేది మూడు రోజులే అయినా మార్చి 10 నుంచి 15 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలకు బ్రేక్ పడ్డట్టే. మార్చి 8 ఆదివారం కావడంతో మార్చి 9న మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి.

ఐదేళ్లకు ఓసారి వేతనాలను పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారిగా 2012లో వేతనాలను పెంచారు. 2017 నవంబర్‌లో వేతనాలు పెంచాల్సి ఉండగా ఇప్పటివరకు కలికలేదు. ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు.దాంతో పాటు మొదటి శనివారం, మూడో శనివారం పనిచేయడానికి బ్యాంకు ఉద్యోగులు సుముఖత చూపట్లేదు. వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో ఎక్కువగా పబ్లిక్ హాలిడేస్ ఉండటం, దేశవ్యాప్తంగా శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేయకపోతే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణాలతో బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌ను ఐబీఏ తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి:

Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా

Realme X50 Pro 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' ఎలా ఉందో చూడండి

IRCTC Tirupati Tour: ఐఆర్‌సీటీసీ నుంచి హైదరాబాద్-తిరుమల టూర్... ప్యాకేజీ వివరాలివే
First published: February 25, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading