Bank Strike: వచ్చేవారం 4 రోజులు బ్యాంకులు బంద్... ఎందుకంటే

Bank Strike | మీరు రెగ్యులర్‌గా బ్యాంకుకు వెళ్తుంటారా? బ్యాంకులో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నాయా? వచ్చేవారం బ్యాంకులు నాలుగు రోజులు పనిచేయవు. మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోండి.

news18-telugu
Updated: March 18, 2020, 11:57 AM IST
Bank Strike: వచ్చేవారం 4 రోజులు బ్యాంకులు బంద్... ఎందుకంటే
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో వ్యాపారాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో వ్యాపారులకు, సామాన్యులకు తిప్పలు తప్పేలా లేవు. వచ్చే వారం బ్యాంకులు నాలుగు రోజులు మూతపడే అవకాశముంది. బ్యాంకు యూనియన్లు మార్చి 27న సమ్మె ప్రకటించాయి. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చడాన్ని వ్యతికిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ నిర్వహిస్తున్నాయి. వచ్చే వారంలో పండుగ సెలవు ఉండటం, వీకెండ్ హాలిడేస్ కలిపి బ్యాంకులు నాలుగు రోజులు మూతపడనున్నాయి. దీంతో సామాన్యులకు కష్టాలు తప్పవు. మరి మీరు ఏవైనా ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకుంటున్నా, ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నా బ్యాంకులు ఏఏ రోజుల్లో బంద్ ఉంటాయో తెలుసుకోవడం మంచిది.

వచ్చే సోమవారం, మంగళవారం బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. మార్చి 25 బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఉంది. దీంతో ఆ రోజు బ్యాంకులకు సెలవు. మళ్లీ మార్చి 26న మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. మార్చి 27న బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 28 నాలుగో శనివారం, మార్చి 29 ఆదివారం బ్యాంకులకు సెలవులు. దీంతో వచ్చే వారం ఏడు రోజుల్లో బ్యాంకులు పనిచేసేది మూడు రోజులే. నాలుగు రోజులు బ్యాంకులు మూతపడతాయి. కాబట్టి ఈ సెలవులను, బంద్‌ను దృష్టిలో పెట్టుకొని మీ లావాదేవీలను ప్లాన్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

SBI News: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకు తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే

Save Money: కోటీశ్వరులు కావాలా? ఈ జపనీస్ టెక్నిక్ ట్రై చేయండి

PMVVY Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 పెన్షన్... మార్చి 31 చివరి తేదీ
Published by: Santhosh Kumar S
First published: March 18, 2020, 11:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading