Bank strike: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్

Bank strike: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్ (ప్రతీకాత్మక చిత్రం)

Bank strike | ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఈసారి వరుసగా 5 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

 • Share this:
  వచ్చే నెలలో మీకు ముఖ్యమైన బ్యాంకు పనులు ఏవైనా ఉన్నాయా? అయితే మీ ట్రాన్సాక్షన్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మార్చిలో బ్యాంకులు వరుసగా ఐదు రోజులు మూతపడనున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లక్షలాది మంది ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. మార్చి రెండో వారంలో వరుసగా మూడు రోజులు సమ్మెకు దిగనున్నారు. దీంతో ఆ మూడు రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించడం ఖాయం. అంతేకాదు. వెంటనే రెండోశనివారం, ఆదివారం కూడా రావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడ్డట్టే. బ్యాంకులు మాత్రమే కాదు... ఏటీఎంలో లావాదేవీలకు సైతం అంతరాయం తప్పదు.

  వేతనాల పెంపు అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-BEFI, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA మార్చి 11 నుంచి 13 వరకు దేశవ్యాప్త సమ్మెకు మరోసారి పిలుపునిచ్చాయి. సరిగ్గా రెండో శనివారానికి ముందు మూడు రోజులు సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించాయి. దీంతో మార్చి 11 నుంచి 13, మార్చి 14న రెండో శనివారం, మార్చి 15న ఆదివారంతో కలిపి ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. సమ్మె మూడు రోజులే అయినా మార్చి 11 నుంచి 15 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలకు బ్రేక్ పడ్డట్టే. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి.

  ఐదేళ్లకు ఓసారి వేతనాలను పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారిగా 2012లో వేతనాలను పెంచారు. 2017 నవంబర్‌లో వేతనాలు పెంచాల్సి ఉండగా ఇప్పటివరకు కలికలేదు. ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. దాందో పాటు మొదటి శనివారం, మూడో శనివారం పనిచేయడానికి బ్యాంకు ఉద్యోగులు సుముఖత చూపట్లేదు. వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తామని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే భారతదేశంలో ఎక్కువగా పబ్లిక్ హాలిడేస్ ఉండటం, దేశవ్యాప్తంగా శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేయకపోతే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణాలతో బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌ను ఐబీఏ తిరస్కరించింది.

  ఇవి కూడా చదవండి:

  Realme PaySa: ఐదు నిమిషాల్లో రూ.1,00,000 వరకు అప్పు... 'రియల్‌మీ పేసా' ఆఫర్

  Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబుల్ వడ్డీ

  Pension Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్
  Published by:Santhosh Kumar S
  First published: