హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank deposit: బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ రూ. 5 లక్షలకు పెంపు.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన

Bank deposit: బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ రూ. 5 లక్షలకు పెంపు.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Bank deposit: బ్యాంకింగ్​ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్​ డిపాజిట్లపై ఇన్సూరెన్స్​ కవర్​ పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు డిపాజిట్లపై రూ. 1 లక్ష వరకు ఉన్న ఇన్సూరెన్స్​ పరిధిని రూ. 5 లక్షలకు పెంచింది.

ఇంకా చదవండి ...

బ్యాంకింగ్​ వ్యవస్థపై (Banking System) ప్రజల్లో మరింత నమ్మకం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్​ డిపాజిట్లపై (Bank Deposits) ఇన్సూరెన్స్​ కవర్​ (Insurance Cover) పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు డిపాజిట్లపై రూ. 1 లక్ష వరకు ఉన్న ఇన్సూరెన్స్​ పరిధిని రూ. 5 లక్షలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘‘గతంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే రూ. 1 లక్ష బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ లభించేది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పరిమితిని రూ.5 లక్షలకు పొడిగించాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఖాతాదారుల్లో బ్యాంకింగ్​ వ్యవస్థపై నమ్మకం కలిగించేందుకు ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాంకులో చేసిన తన డిపాజిట్లన్నింటికీ ఏదైనా సమస్య తలెత్తితే లేదా బ్యాంకు దివాలా తీస్తే అతనికి రూ. 5 లక్షల వాపసు లభిస్తుంది.’’ అని గోయల్‌ పేర్కొన్నారు.

కాగా, సదరు బ్యాంకు మూతపడిన 90 రోజుల్లోగా డిపాజిట్ చేసిన సొమ్మును డిపాజిటర్లకు తిరిగి చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు దాదాపు 10 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును మూసివేయాలని నిర్ణయించిన కేవలం 90 రోజుల్లోనే డిపాజిటర్లకు రూ. 5 లక్షలు తిరిగి చెల్లిస్తుంది. బ్యాంకు మూసివేసిన 90 రోజులలోపు సదరు డిపాజిటర్​ బ్యాంక్​ అకౌంట్​లో డబ్బు జమ అవుతుంది. వ్యవధి తగ్గింపు వల్ల 10 సంవత్సరాల్లో డిపాజిటర్లు కోల్పోయే వడ్డీ నష్టాన్ని ఆదా చేయవచ్చని కూడా గోయల్ చెప్పారు.

Petrol and diesel Prices: స్థిరంగానే పెట్రోల్​, డీజిల్​ ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రోల్​ ధరలు ఎలా ఉన్నాయంటే..* సాధారణ డిపాజిటర్లకు మేలు

ఈ కార్యక్రమం 98 శాతం మంది డిపాజిటర్లకు అతిపెద్ద కవరేజీని అందిస్తుంది. ఆగస్టులో పార్లమెంటు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్​ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, 2021ని ఆమోదించింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ భారతదేశంలో పని చేస్తున్న అన్ని వాణిజ్య బ్యాంకుల్లోని సేవింగ్స్​, ఫిక్స్​డ్​ డిపాజిట్లు, కరెంట్, రికరింగ్ డిపాజిట్లు మొదలైన అన్ని డిపాజిట్లను కవర్ చేస్తుంది. ఇది కాకుండా, రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తున్న రాష్ట్ర, కేంద్ర, ప్రాథమిక సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లకు ఈ కూడా ఈ ఇన్సూరెన్స్​ కవరేజీ లభిస్తుంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Bank, Fixed deposits, Insurance

ఉత్తమ కథలు