రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో బ్యాంకు ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నియమనిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌లో ఎప్పటికప్పుడు తమ నో యువర్ కస్టమర్ (KYC) వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నియమనిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌లో ఎప్పటికప్పుడు తమ నో యువర్ కస్టమర్ (KYC) వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్బీఐ ఊరట కల్పించింది. రీ-కేవైసీ (re-KYC) కోసం ఖాతాదారులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే తమ కేవైసీ వివరాలు అప్డేట్ చేయొచ్చు. అడ్రస్‌లో ఏవైనా మార్పులు ఉంటే తప్ప, మిగతా వివరాలన్నీ ఆన్లైన్లోనే అప్డేట్ చేయొచ్చు.
బ్యాంకు ఖాతాదారులు ఒకవేళ అడ్రస్ మార్చాలనుకుంటే బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా వివరాలన్నీ ఆన్లైన్లో సులువుగా అప్డేట్ చేయొచ్చు. ఖాతాదారులు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు కోరినప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రీ-కేవైసీ పూర్తి చేయాలి. బ్యాంకులు తమ ఖాతాదారుల్ని బ్రాంచ్‌కు రావాలని కోరకుండానే రీ-కేవైసీ పూర్తి చేయొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఒకవేళ బ్రాంచ్‌కు రావాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తే కస్టమర్లు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయొచ్చని శక్తికాంత దాస్ అన్నారు. కాబట్టి బ్యాంకు ఖాతాదారులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రీ-కేవైసీ చేయొచ్చన్న విషయం గుర్తుంచుకోవాలి.
Vande Bharat Train: మా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వందే భారత్ రైలు కావాలి... తెరపైకి కొత్త డిమాండ్
ఇక ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్స్ రెపో రేట్‌ను పెంచింది. దీంతో రెపో పేట్ 6.25 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది రెపో రేట్ పెంచడం వరుసగా ఇది ఐదోసారి. మే 4న 40 బేసిస్ పాయింట్స్, జూన్ 8న 50 బేసిస్ పాయింట్స్, ఆగస్ట్ 5న 50 బేసిస్ పాయింట్స్, సెప్టెంబర్ 30న 50 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే మొత్తం 225 బేసిస్ పాయింట్స్ అంటే 2.25 శాతం వడ్డీ రేటు పెంచింది ఆర్బీఐ. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. ఆర్బీఐ రెపో రేట్ ఎంత పెంచితే రుణాలు తీసుకున్నవారు అంత శాతం వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆర్బీఆ రెపో రేట్ పెంచినప్పుడల్లా కస్టమర్లకు ఈఎంఐలు భారం అవుతాయి.
Tirumala Darshanam: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్ సులువుగా పొందండి ఇలా
ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. ఆర్బీఐ రెపో రేట్ పెంచితే బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ , ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Personal Finance, Rbi, Rbi governor