Good News: ఈ ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి

ఆర్థిక సంవత్సరం చివర కాబట్టి ప్రభుత్వ లావాదేవీల కోసం బ్యాంకులు మార్చి 30న రాత్రి 8 గంటల వరకు, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

news18-telugu
Updated: March 28, 2019, 6:25 PM IST
Good News: ఈ ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి
Good News: ఈ ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి
news18-telugu
Updated: March 28, 2019, 6:25 PM IST
ఈ ఆదివారం(మార్చి 31) బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆదివారం కూడా బ్యాంకుల్ని తెరిచే ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వం జరిపే ఆర్థిక లావాదేవీలకు ఆటంకం కలగకుండా ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయన్నది ఆర్‌బీఐ సర్క్యులర్ సారాంశం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో లెక్కించాలని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించింది.

ఆర్థిక సంవత్సరం చివర కాబట్టి ప్రభుత్వ లావాదేవీల కోసం బ్యాంకులు మార్చి 30న రాత్రి 8 గంటల వరకు, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. లావాదేవీల విషయంలో ఇబ్బందులు, జాప్యం ఎదురవకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, ఇతర ఎలక్ట్రానిక్ లావాదేవీల సమయాన్ని కూడా పొడిగించాలని సూచించింది.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్




ఇవి కూడా చదవండి:

SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే

RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...