భారత ‘దిగుమతుల’ను ఆపేసిన బంగ్లాదేశ్...

బంగ్లాదేశ్‌కు సరుకును తీసుకుని వెళ్తున్న సుమారు 1500 లారీలు భారత సరిహద్దు వద్దే నిలిచిపోయాయి.

news18-telugu
Updated: July 2, 2020, 10:51 PM IST
భారత ‘దిగుమతుల’ను ఆపేసిన బంగ్లాదేశ్...
ప్రతీకాత్మక చిత్రం (Image:Reuters)
  • Share this:
భారత్ నుంచి దిగుమతులకు సంబంధించి అంగీకారం కుదిరి 23 రోజులు అయినా, భారత్ నుంచి దిగుమతులు చేసుకుంటున్నా, ఇండియాకు ఎగుమతులు చేసేందుకు అవకాశం కుదరకపోవడంతో బంగ్లాదేశీ వ్యాపారులు భారత్ దిగుమతులను నిలిపివేశారు. పెట్రాపోల్ - బెనాపోల్ మార్గంలో భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి వెళ్లే భారత ఉత్పత్తులను రానివ్వకుండా ఆపేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యాపారులు పశ్చిమ బెంగాల్ మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతులకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇంకా ఇవ్వకపోవడంతో వారు నిన్న రాత్రి పెట్రాపోల్ బోర్డర్ వద్ద నిరసనకు దిగినట్టు సమాచారం. జూన్ 7 నుంచి భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. పెట్రా పోల్ బోర్డర్ ద్వారా బంగ్లాదేశ్‌కు వెళ్తున్నాయి. అయితే, బంగ్లాదేశ్ నుంచి మాత్రం భారత్‌కు దిగుమతులు కావడం లేదు. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ దిగుమతులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఎగుమతిదారులు కోరుతున్నారు.

బంగ్లాదేశ్‌కు సరుకును తీసుకుని వెళ్తున్న సుమారు 1500 లారీలు భారత సరిహద్దు వద్దే నిలిచిపోయాయి. జూన్ 14న పార్కింగ్‌కు క్లియర్ చేసిన తర్వాత నుంచి కాళితల (బనగాం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది) పార్కింగ్ ప్రాంతంలో కొత్తగా ట్రక్కులను అనుమతించడం లేదు. బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యే గూడ్స్ అంతా ఇక్కడ చెక్ చేసి పంపుతారు.
First published: July 2, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading