Fixed Deposits | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ తాజాగా రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు (FD) పెంచేసింది. వడడ్ రేట్ల పెంపు జనవరి 30 నుంచి అమలులోకి వచ్చింది. తాజా రేట్ల పెంపు నేపథ్యంలో చూస్తే.. బ్యాంక్ గరిష్టంగా ఎఫ్‌డీలపై 7.9 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
7 రోజుల నుంచి 15 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. 16 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంది. 91 రోజుల 180 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.25 శాతంగా కొనసాగుతోంది. 181 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.75 శాతం వడ్డీ వస్తోంది. 365 రోజుల నుంచి 15 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.9 శాతంగా కొనసాగుతోంది. 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.15 శాతంగా ఉంది. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5 శాతంగా ఉంది.
మార్కెట్‌లోకి కొత్త కారు.. మైలేజ్ 26 కిలోమీటర్ల పైనే..
కాగా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన తర్వాత మళ్లీ మెచ్యూరిటీ వరకు ఆగాల్సిందే. ముందే డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. ఒక శాతం పెనాల్టీ చెల్లించుకోవాలి. అందువల్ల డబ్బులు పెట్టేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. డబ్బులతో అవసరం లేకపోతేనే ఎఫ్‌డీ చేయడం ఉత్తమం.
అదిరిపోయే లుక్‌తో హీరో కొత్త స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్లు సూపర్!
కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును పెంచుకుంటూ వచ్చింది. దీని వల్ల బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి. అంతేకాకుండా రానున్న కాలంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆర్‌బీఐ ఫిబ్రవరి నెలలో కూడా రెపో రేటు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల ఇదే జరిగితే బ్యాంకులు మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. అందువల్ల డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఇంకొంత కాలం ఆగితే మంచిదని చెప్పుకోవచ్చు. అధిక వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, FD rates, Fixed deposits