హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు పెంచిన మరో బ్యాంక్.. గరిష్టంగా 8 శాతం.. పూర్తి వివరాలు

FD Rates Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు పెంచిన మరో బ్యాంక్.. గరిష్టంగా 8 శాతం.. పూర్తి వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bandhan Bank: ఇండియాలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను వరుసగా పెంచుతున్నాయి. ఈ లిస్ట్‌లో బంధన్ బ్యాంక్ కూడా చేరింది. ఈ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వర్తించే కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను వరుసగా పెంచుతున్నాయి. ఈ లిస్ట్‌లో బంధన్ బ్యాంక్ (Bandhan Bank) కూడా చేరింది. ఈ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వర్తించే కొత్త వడ్డీ రేట్లు(Fixed Deposits) నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటు పెంపు తాజా డిపాజిట్లతో పాటు మెచ్యూరింగ్ డిపాజిట్ల రెన్యూవల్స్‌కు కూడా వర్తిస్తుంది. బంధన్ బ్యాంక్ 600 రోజుల టెన్యూర్‌కు చేసిన డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 0.50 శాతం ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. దీంతో సీనియర్‌ సిటిజన్లు(Senior Citizens) 600 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీకి 8 శాతం రాబడిని అందుకుంటారు. సీనియర్ సిటిజన్‌లకు 1 సంవత్సరం కంటే తక్కువ టెన్యూర్‌కి చేసిన ఎఫ్‌డీలపై 0.75 శాతం అధిక వడ్డీని బంధన్‌ బ్యాంక్‌ అందిస్తోంది.

* లేటెస్ట్‌ ఎఫ్‌డీ రేట్లు

బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 రోజుల నుంచి 30 రోజుల టెన్యూర్‌కి సాధారణ ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 3.75 శాతం వడ్డీ అందిస్తోంది. 31 రోజుల నుంచి 2 నెలల కంటే తక్కువ గడువుతో వచ్చే ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 4.25 శాతం రాబడి లభిస్తుంది. 2 నెలల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ టెన్యూర్‌కి చేసిన ఎఫ్‌డీలపై నాన్-సీనియర్ సిటిజన్‌లకు 4.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 5.25 శాతం వడ్డీ దక్కుతుంది.

ఒక సంవత్సరం నుంచి 599 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ వస్తుంది. 601 రోజుల నుంచి ఐదేళ్ల లోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం రాబడి లభిస్తుంది. 5 నుంచి 10 సంవత్సరాల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలు 5.6 శాతం, సీనియర్‌ సిటిజన్లు 6.35 శాతం రాబడిని పొందవచ్చు.

Bank Strike: ఆ రోజు బ్యాంకుల సమ్మె... దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఏటీఎం సేవలపై ప్రభావం

EPFO Alert: ఉద్యోగులకు రూ.7 లక్షల వరకు బెనిఫిట్... వారికి కూడా వర్తిస్తుందన్న ఈపీఎఫ్ఓ

* బంధన్ బ్యాంక్ FD కాలిక్యులేటర్

సీనియర్ సిటిజన్లు 600 రోజుల టెన్యూర్‌కి రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే.. 8 శాతం చొప్పున రూ.28,226 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ మొత్తం రూ.2,28,226 అవుతుంది. అదే విధంగా సాధారణ ప్రజలకు రూ.26,368 రాబడి దక్కుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ.2,26,368 అవుతుంది. ఐదేళ్లకు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ.64,113 వడ్డీని పొందవచ్చు. మెచ్యూరిటీ మొత్తం రూ.2,64,113 అవుతుంది. ఇదే మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తే సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల టెన్యూర్‌కి రూ.2,74,054 రిటర్న్ వస్తుంది.

కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న బంధన్‌ బ్యాంక్‌, గత త్రైమాసికంలో రూ.209.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అధిక కేటాయింపుల కారణంగా ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.3,008.60 కోట్ల నెట్‌ లాస్‌ను నమోదు చేయడం గమనార్హం.

First published:

Tags: Interest rates

ఉత్తమ కథలు