Bajaj Pulsar NS 125: బజాజ్ పల్సర్ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే ?

బజాబ్ పల్సర్ ఎన్ఎస్ 125 (ప్రతీకాత్మక చిత్రం)

ఈ ధరల పెరుగుదలకు వెనుక ఉన్న కారణాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. పెరిగిన ఇన్పుట్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Share this:
దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో వరుసగా తన వాహన ధరలను పెంచుతూ వినియోగదారులకు షాకిస్తుంది. ఇటీవల​ పల్సర్ 180 డాగర్ ఎడిషన్ ధరలను పెంచిన బజాజ్​.. ఇప్పుడు పల్సర్​ ఎన్​ఎస్​ 125 ధర పెంచేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ బైక్​ ధర రూ. 93,630 వద్ద ఉండగా.. దాన్ని ఇప్పుడు రూ. 99,731 ధరకు పెంచింది. అంటే విడుదలైన మూడు నెలల్లోనే దీని ధర అమాంతం రూ. 6,101 పెరిగింది. అయితే, ఈ ధరల పెరుగుదలకు వెనుక ఉన్న కారణాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. పెరిగిన ఇన్పుట్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వాస్తవానికి, పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని పూడ్చుకునేందుకు దాదాపు అన్ని పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఇటీవలి కాలంలో ధరలు పెంచుతున్నాయి. దీంతో, బజాజ్​ కూడా అనివార్యంగా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. కాగా, బజాజ్ పల్సర్ 125 ఎన్ఎస్ ఎంట్రీ లెవల్ మోడల్. డిజైన్​, ఫీచర్ల పరంగా చూస్తే ఈ బైక్​ పల్సర్​ ఎన్​ఎస్​160ను పోలి ఉంటుంది. ఇది బీచ్​ బ్లూ, ఫైరీ ఆరెంజ్​, బర్న్​ రెడ్​,ప్యూటర్​ గ్రే అనే నాలుగు కలర్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, పల్సర్​ సిరీస్​లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని బైక్​లలో కెల్లా ఇదే అత్యంత సరసమైన, తక్కువ సీసీ కలిగిన బైక్​ కావడం విశేషం. యూత్​ను టార్గెట్​ చేసుకొని బజాజ్​ సంస్థ ఈ బైక్​ను రిలీజ్​ చేసింది.

ఏప్రిల్​లో రిలీజైన పల్సర్​ 125 ఎన్​ఎస్​​..
బజాజ్​ పల్సర్ ఎన్​ఎస్​ 125లో అద్భుతమైన ఫీచర్లను అందించారు. అందుకే, విడుదలైన మూడు నెలల్లోనే గణనీయమైన అమ్మకాలను చూసింది. బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​ 125​లో 45 సిసి, ఎస్‌ఓహెచ్‌సి, ఎయిర్-కూల్డ్ ఇంజన్​ని అందించారు. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 12 బిహెచ్‌పి, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్‌ఎమ్‌ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ ప్లాంట్ 5 -స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని బరువు కేవలం 144 కిలోలు ఉంటుంది. తద్వారా, ఎంట్రీ లెవల్ రైడర్స్​కు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సస్పెన్షన్ సెటప్‌లో నైట్రోక్స్ మోనో-షాక్‌తో టెలిస్కోపిక్ ఫోర్కులను అందించారు. దీనిలో 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌, 130 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్‌తో పాటు సిబిఎస్ (కాంబి-బ్రేక్ సిస్టమ్)ను​ అందించారు. ఈ బైక్​లో సెమీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్‌, అనలాగ్ టాకోమీటర్, స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, క్లాక్ మొదలైన రీడౌట్‌ డిజిటల్ డిస్​ప్లేను కూడా చేర్చింది.
First published: