Pulsar P150 | ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto) సరికొత్త టూవీలర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. లేటెస్ట్ వెర్షన్ పల్సర్ 150 (Pulsar 150) బైక్‌ను లాంచ్ చేసింది. ఇందులో కొత్త డిజైన్, కొత్త ఇంజిన్, వివిధ రకాల కొత్త ఫీచర్లు ఉన్నాయి. పల్సర్ ఎన్250, ఎఫ్250, ఎన్160 వంటి బైక్స్‌కు చెందిన ప్లాట్‌ఫామ్ మీదనే ఈ కొత్త బైక్‌ను కంపెనీ తయారు చేసింది. అయితే ఈ కొత్త బైక్ స్పోర్టియర్ లుక్‌తో ఉంది. అలాగే బరువు కూడా తక్కువే. ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న మూడో జనరేషన్ పల్సర్ బైక్ ఇది.
ఇంకా ఈ బైక్‌లో ఏరోడైనమిక్ 3డీ ఫ్రంట్, డ్యూయెల్ కలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ డిస్క్ వేరియంట్, ట్విన్ డిస్క్ వేరియంట్ అనే రెండే ఆప్షన్లలో ఈ బైక్ లభిస్తోంది. స్ల్పిట్ సీట్ ఫీచర ఉంది. సీటు హైట్ 790 ఎంఎం. రైడర్ కంఫర్ట్‌గా ఉంటుంది. మోనో షాక్ రియర్ సస్పెషన్ ఫీచర్ ఉందని చెప్పుకోవచ్చు. బెటర్ బ్యాలెన్స్, హ్యాండ్లింగ్ ఈ బైక్ సొంతం అని చెప్పుకోవచ్చు.
బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఆన్లైన్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి!
కొత్త బజాజ్ పల్సర్ పీ150 బైక్‌లో 149 సీసీ ఇంజిన్ ఉంటుంది. బెస్ట్ ఇన్ క్లాస్ పవర్ దీని సొంతం. ఈ బైక్ గరిష్ట పవర్ 14.5 పీఎస్ @ 8500 ఆర్పీఎం. టార్క్ 13.5 ఎన్ఎం @ 6000 ఆర్పీఎం. సూపీరియర్ గేర్ షిప్ట్, బెటర్ ఎన్వీహెచ్ మేనేజ్మెంట్ వంటి వాటి వల్ల ఈ కొత్త పల్సర్ 150 ఇతర పల్సర్ బైక్స్‌లో కెల్లా మోస్ట్ రిఫైన్డ్ బైక్‌గా చెప్పుకోవచ్చు.
కస్టమర్లకు ఒకేసారి 2 శుభవార్తలు అందించిన బజాజ్ ఫైనాన్స్!
ఈ కొత్త బజాజ్ పల్సర్ పీ150 బైక్ ధర కూడా ఆకర్షణీయంగానే ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,19,757గా ఉంది. అంటే రూ. 1.2 లక్షలు అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రేసింగ్ రెడ్, కారీబియన్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ, బ్లాక్ వైట్ అనేవి కలర్ ఆప్షన్లు. ఈ బైక్ ప్రధానంగా హోండా యూనికార్న్, హోండా ఎక్స్‌బ్లేడ్, సుజుకీ జిక్సర్ వంటి బైక్స్‌కు పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డ్యూయెల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కిక్ స్టార్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ రెండూ ఉంటాయి. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.