• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • BAJAJ FINSERV EMI STORE OFFERS SAMSUNG REFRIGERATOR NO COST EMI STARTING FROM RS 890 NS GH

Refrigerator Offers: ఫ్రిజ్​ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈ సూపర్ ఆఫర్ గురించి తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ఈ వేసవిలో ఫ్రిజ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, సరిపడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే కేవలం రూ. 890 నెలవారీ వాయిదాల్లో కొనుగోలు చేసే ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి.

  • Share this:
వేసవిలో రిఫ్రిజరేటర్​ కొనుగోలు చేయాలనుకుంటారు చాలా మంది. అయితే, ఒకేసారి మొత్తం డబ్బు కట్టలేక వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారికి అద్భుతమైన ఆఫర్​ ప్రకటించింది బజాజ్​ ఫిన్​సర్వ్​ సంస్థ. తన ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లో శామ్​సంగ్​ రిఫ్రిజరేటర్ల కొనుగోలుపై నో కాస్ట్ EMI ఆప్షన్​ను అందిస్తోంది. కేవలం రూ. 890 నెలవారీ వాయిదాల్లో ఈ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేయవచ్చు. ఆకర్షనీయమైన ఫీచర్లు, అప్​డేటెడ్​ టెక్నాలజీనికి శామ్​సంగ్​ ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. శామ్​సంగ్​ రిఫ్రిజిరేటర్లను డిజిటల్ ఇన్వర్టర్​, ఆల్ రౌండ్ క్లీనింగ్, పేటెంట్ టెక్నాలజీతో రూపొందిస్తారు. ఈ రిఫ్రిజిరేటర్లు మంచి, స్థిరమైన కూలింగ్​ సిస్టమ్​ను అందిస్తాయి. శామ్​సంగ్​ సంస్థ కేవలం సింగిల్​ డోర్​ రిఫ్రిజిరేటర్లనే కాదు డబుల్ డోర్, సైడ్​ బై సైడ్​, ప్రీమియం ఫ్రెంచ్ డోర్ మోడళ్లను విక్రయిస్తోంది. మీ అన్ని అవసరాలు, బడ్జెట్​ను బట్టి వీటిలో ఏదైనా మోడల్​ను ఎంచుకోవచ్చు. ఒకేసారి మొత్తం చెల్లించకుండా నో కాస్ట్ EMI ఆప్షన్​లోనే ఈ శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేయవచ్చు. జజాజ్​ ఫిన్​సర్వ్​ ఆన్​లైన్​ ఈఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే వారికి జీరో డౌన్ పేమెంట్, ఫ్రీ హోమ్​ డెలివరీ వంటివి లభిస్తుండటం ఆకట్టుకునే అంశం.
OPPO Reno 6: ఒప్పో రెనో 6 సిరీస్​ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్​ఫోన్లు లాంఛ్​.. ధర, ఫీచర్ల వివరాలివే..

భారీ డిమాండ్​ ఉన్న రిఫ్రిజిరేటర్లు ఇవే..
శామ్​సంగ్​ అనేక రిఫ్రిజిరేటర్​ మోడళ్లను విక్రయిస్తున్నప్పటికీ.. కొన్ని మోడళ్లు మాత్రం అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. వీటిలో శామ్​సంగ్​ 212- లీటర్ 5-స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ముందువరుసలో ఉంది. దీన్ని బజాజ్​ ఫిన్​సర్వ్​ ఆన్​లైన్​ స్టోర్​లో కేవలం రూ .890 నెలవారీ ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. ఇక, శామ్​సంగ్ 198-లీటర్ 5-స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్​ను రూ. 1,000 నెలవారీ ఈఎంఐ రూపంలో కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్ 198- లీటర్ 3-స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్​ను రూ .1,025 నెలవారీ ఈఎంఐల రూపంలో కొనుగోలు చేయవచ్చు.

శామ్‌సంగ్ 386 లీటర్ 2- స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్​ను రూ. 2,333 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీ, పూణే, ముంబై, థానే, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలకు చెందిన కస్టమర్లకు ఇవి అందుబాటులో ఉంటాయి. వారు నేరుగా బజాజ్ ఫిన్​సర్వ్ EMI స్టోర్​ల నుండి వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ EMI స్టోర్‌లో షాపింగ్ చేయడం ద్వారా, కస్టమర్లకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా, వేగవంతంగా హోమ్​ డెలివరీ, నో కాస్ట్ EMI, జీరో డౌన్ పేమెంట్, క్యాష్‌బ్యాక్, అదనపు డిస్కౌంట్లు వంటివి లభిస్తాయి.

ఇలా కొనుగోలు చేయండి..
కొనుగోలుదారులు 3 నుంచి 24 నెలల వరకు ఈఎంఐని ఎంపిక చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి వారి EMI స్టోర్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు నచ్చిన శామ్‌సంగ్ రిఫ్రిజరేటర్​ను ఎంచుకొని బై నౌ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. పేమెంట్ విండో వద్ద EMI ఆప్షన్​ను ఎంచుకోండి. మరిన్ని వివరాల కోసం www.bajajfinservmarkets.in వెబ్​సైట్​ను సందర్శించండి. లేదా గూగుల్​ ప్లేస్లోర్​ నుంచి ఫిన్​సర్వ్​ మార్కెట్స్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకొని షాపింగ్​ చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: