BAJAJ FINSERV CUTS HOME LOAN INTEREST RATE CAN GET UPTO 5 CRORE AT JUST RS 645 INTEREST PER LAKH HERE IS THE DETAILS AK GH
Bajaj Finserv: పండుగ వేళ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బంపరాఫర్.. 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు
Bajaj Finserv: పండుగ వేళ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బంపరాఫర్.. తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు
అంతకుముందు ఈ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది. ఇప్పుడు 0.05% మేర తగ్గించింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహీతలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త రుణాలతో పాటు లోన్ ట్రాన్స్ఫర్లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ సందర్భంగా గృహ రుణ వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి కేవలం 6.70% వడ్డీ రేటుకే హోమ్ లోన్(Home Loan) అందజేస్తామని తెలిపింది. అంతకుముందు ఈ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది. ఇప్పుడు 0.05% మేర తగ్గించింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహీతలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త రుణాలతో పాటు లోన్ ట్రాన్స్ఫర్లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఇప్పటికే ఇతర బ్యాంక్‌లలో హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లు తమ లోన్‌ను బజాజ్ ఫిన్సర్వ్(Bajaj Finserv)కు బదిలీ చేయడం ద్వారా ఈ కొత్త వడ్డీ రేటు ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది. వారు వడ్డీని ఆదా చేసుకోవడమే కాకుండా, లోన్ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ గృహ రుణ బ్యాలెన్స్ బదిలీ ప్రక్రియ సులభతరంగా, కనీస డాక్యుమెంటేషన్‌తో పూర్తవుతుంది. ఆసక్తిగల కస్టమర్లు తమ వెబ్సైట్ ద్వారా లేదా నేరుగా సమీపంలోని బజాజ్ ఫిన్సర్వ్ కార్యాలయాన్ని సందర్శించి హోమ్‌లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
! బజాజ్ హోమ్‌లోన్ ఫీచర్లు, బెనిఫిట్స్
30 సంవత్సరాల వరకు లోన్ రీపేమెంట్ వ్యవధి.
ఉద్యోగం, వేతనాన్ని బట్టి రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ రుణం తీసుకునే అవకాశం.
లోన్ ట్రాన్స్ఫర్ విషయంలో రూ. 1 కోటి వరకు అదనంగా తీసుకునే అవకాశం.
PMAY స్కీమ్ కింద ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాలకు వడ్డీ రాయితీ.
జీతం తీసుకునే ఉద్యోగులు, మెరుగైన క్రెడిట్ స్కోర్ గల కస్టమర్లు.
దరఖాస్తుదారుడికి పబ్లిక్ లేదా ప్రైవేట్ లేదా ఎంఎన్సీ కంపెనీలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. ఎన్ఆర్ఐలు అనర్హులు. 23 నుంచి 62 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తుదారుడి వయస్సు, నివాస స్థలం ఆధారంగా కనీసం ఆదాయం రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు ఉండాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.