Chetak Electric Scooter | మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఓలా (Ola) దగ్గరి నుంచి ఏథర్, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ వరకు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నాయి. వీటిల్లో బజాజ్ (Bajaj) కూడా ఉంది. బజాజ్ ఆటో కంపెనీ నుంచి చేతక్ పేరుతో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బజాజ్ చేతక్ స్టీల్ బాడీ ప్యానెల్స్‌తో తయారైంది. అంటే దీర్ఘకాలం వరకు కస్టమర్లకు మన్నికకు వస్తుంది. స్టైల్ కూడా అదిరిపోయింది. అంతేకాకుండా యాప్ ద్వారా చేతక్ స్కూటర్‌తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అలాగే బెల్ట్ కాకుండా స్టీల్ గేర్ డైరెక్ట్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌ను ఇందులో అమర్చారు. దేశ వ్యాప్తంగా 40కి పైగా పట్టణాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఏపీలో గుంటూరు , రాజమండ్రి , తిరుపతి , విజయవాడ , విశాఖ పట్నం వంటి పలు ప్రాంతాల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. దీని ఆన్ రోడ్ ధర దాదాపు రూ. 1.6 లక్షలుగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లో దీన్ని కొనొచ్చు. దీని ఆన్ రోడ్ రేటు రూ.1.56 లక్షలు.
రూ.100 పొదుపుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు
అంతేకాకుండా ఈ సకూటర్‌లో ఐపీ 67 వాటర్ ప్రొటెక్షన్ లభిస్తుంది. బ్యాటరీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. యాప్ ద్వారా చార్జింగ్ స్టేటస్, బ్యాటరీ స్టేటర్, ఫైండ్ వెహికల్, నోటిఫికేషన్స్ వంటి పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 90కి పైగా కిలోమీటర్లు వెళ్తుంది. కేవలం 4 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. బ్యాటరీపై మూడేళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది.
నెల నెలా అకౌంట్‌లోకి రూ.8,875.. పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈజీ ఈఎంఐలో కొనొచ్చు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఈ స్కూటర్ కొనుగోలుకు సులభంగా రుణం పొందొచ్చు. బజాజ్ చేతక్ స్కూటర్‌ను కేవలం రూ. 2 వేలతో బుక్ చేసుకోవచ్చు. తర్వాత మిగిలిన డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే లోన్ తీసుకోవచ్చు. రుణం వద్దనుకుంటే ఒకేసారి స్కూటర్ ధరను పేమెంట్ చేయొచ్చు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దుమ్మురేపుతోందని చెప్పుకోవచ్చు. హీరో ఎలక్ట్రిక్, ఏథర్, టీవీఎస్ కంపెనీలు కూడా అదరగొడుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో బజాజ్ చేతక్ నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bajaj, Bajaj finance, E scootor, Electric Scooter, Electric Vehicle, Ev scooters, Ola Electric Scooter, SCOOTER