హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bajaj CT 100: పెట్రోల్ రూ.100 దాటేస్తోంది...మరి ఈ బైక్‌తో ఒక రూపాయికి కిలోమీటర్ వెళ్లొచ్చట..

Bajaj CT 100: పెట్రోల్ రూ.100 దాటేస్తోంది...మరి ఈ బైక్‌తో ఒక రూపాయికి కిలోమీటర్ వెళ్లొచ్చట..

Bajaj CT100 KS. (Image source: Bajaj)

Bajaj CT100 KS. (Image source: Bajaj)

పెట్రోల్ ధరలు మండి పోతున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మైలేజ్ మంచి పనితీరుతో బైక్ కోరుకునేవారి కోసం బజాజ్ ఆటో అద్భుతమైన బైక్‌ను ప్రవేశపెట్టింది. సంస్థ ఇటీవల తన సిటి 100 బైక్‌ను అప్‌గ్రేడ్ చేసి 'సిటి 100' గా పరిచయం చేసింది.

  Bajaj CT 100 KS: పెట్రోల్ ధరలు మండి పోతున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మైలేజ్ మంచి పనితీరుతో బైక్ కోరుకునేవారి కోసం బజాజ్ ఆటో అద్భుతమైన బైక్‌ను ప్రవేశపెట్టింది. సంస్థ ఇటీవల తన సిటి 100 బైక్‌ను అప్‌గ్రేడ్ చేసి 'సిటి 100' గా పరిచయం చేసింది. బజాజ్ ఆటో ప్రకారం, ఈ బైక్ 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది మరియు దాని ధర కూడా చాలా తక్కువ. కాబట్టి ఇందులో ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం… ఇందులో ఆకర్షణీయమైన విషయమేంటంటే... ఈ బైక్‌లో ఇదివరకటి వాటిలో లేని 8 కొత్త ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ CT100 కిక్ స్టార్ట్ (2020 Bajaj CT100 kick-start) వేరియంట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. ధర రూ.46,432గా తెలిపారు. కొత్త ఫీచర్లు ఎక్కువే ఉన్నా... పాత మోడల్ కంటే... కొత్త మోడల్ ధర రూ.2వేలు మాత్రమే ఎక్కువగా ఉంది. మరి ఈ బైక్ స్పెషల్ ఫీచర్లేంటో ఫటాఫట్ తెలుసుకుందాం.

  Features and specifications:

  ఈ బైక్‌కి ఫ్రంట్... సస్పెన్షన్ బెల్లోస్ ఉన్నాయి. ఆయిల్ కోసం రియల్ టైమ్ మీటర్ ఉంది. వాటితోపాటూ... రబ్బర్ ట్యాంక్ ఉంది. ఇంకా... బ్యాటరీ స్టెబిలిటీ కోసం... క్రాస్ ట్యూబ్‌తో కూడిన హ్యాండిల్ బార్ ఉంది. ఫియట్ ప్యాడ్‌తో కూడిన సీట్ వాడారు. ఫ్లెక్సిబుల్, క్లీన్ ఇండికేటర్ లెన్స్ కోసం... గ్లాస్ సైజ్ పెంచారు.

  This bike will get everything in these colors:

  సరికొత్త CT100 KS బైక్... మూడు కలర్స్‌లో లభిస్తోంది. గ్లాస్ ఇబోనీ బ్లాక్ బైక్‌కి బ్లూ డెకాల్స్ ఉన్నాయి. మాట్టీ ఆలివ్ గ్రీన్ బైక్‌కి ఎల్లో కలర్ డెకాల్స్ ఉన్నాయి. గ్లోస్ ఫ్లేమ్ రెడ్ కలర్ ‌బైక్‌కి బ్రైట్ రెడ్ డెకాల్స్ ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర రూ.46,432 కాగా... ఈ బైక్స్... దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ ఆటో డీలర్‌షిప్‌లలో మీకు లభిస్తాయి అని మార్కెటింగ్ హెడ్ నారాయణ్ సుందరామన్ తెలిపారు.

  Company:

  బజాజ్ కంపెనీ ఇప్పటివరకూ 68 లక్షల సీటీ రేంజ్ బైకులు అమ్మింది. సీటీ బ్రాండ్ బైకులు స్ట్రాంగ్ ఆఫర్, స్ట్రాంగ్ ఇంజిన్, ఎక్కువ కాలం మన్నేలా, ఎక్కువ మైలేజ్ ఇచ్చేలా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కారణంగానే తాము టూవీలర్ సెగ్మెంట్‌లో టాప్ పొజిషన్లలో ఒకరిగా నిలుస్తున్నామని సుందరామన్ వివరించారు.

  It has many new features:

  ఈ సరికొత్త CT100 KSలో ఫీచర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంధనాన్ని ఆదా చేయగలదు. బజాజ్ CT 100 KS ఎల్లాయ్, ES ఎల్లాయ్ మధ్య ధరల్లో తేడా జస్ట్ రూ.5వేలే ఉంది. బజాజ్ CT ES ఎల్లాయ్ ఎక్స్ షోరూం ధర రూ.51802 ఉంది.

  Bajaj bikes are known for special mileage:

  బజాజ్ బైకులు... మైలేజీకి పేరున్నవి. వీటికి చిన్న ఇంజిన్ ఉండటం వల్ల... ఇవి ఇతర బైకులన్నింటికంటే ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. రోజు వారీ వాడకానికి ఈ బైక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి.

  will mileage of 90 km:

  బజాజ్ CT100 KS... గంటకు 90 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోంది. ARAI జరిపిన ట్రయల్స్ ద్వారా ఈ విషయం తెలిసింది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Automobiles, Bikes

  ఉత్తమ కథలు