భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూవీలర్ తయారీ సంస్థ బజాబ్ ఆటో.. పల్సర్ సిరీస్‌లో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. పల్సర్ P150 పేరుతో స్టైలిష్ లుక్‌లో కొత్త బైక్‌ను పరిచయం చేసింది. రూ.1.17 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ప్రారంభ ధరతో లేటెస్ట్ మోడల్‌ను విడుదల చేసింది. సింగిల్-డిస్క్(సింగిల్ సీట్), ట్విన్-డిస్క్(స్ప్లిట్ సీట్) వంటి రెండు వేరియంట్లలో ఈ బైక్ లభించనుంది. కొత్త బైక్ ధర, స్పెసిఫికేషన్లు చూద్దాం.
కొత్త పల్సర్ బైక్ డిజైన్, మునుపటి మోడల్స్ అయిన N160, N250 మాదిరిగానే కనిపిస్తోంది. ఇది బజాజ్ నుంచి వచ్చిన మూడో జనరేషన్ ప్రొడక్ట్ కావడం గమనార్హం. స్టైలింగ్ విషయానికొస్తే.. పల్సర్ P150 మోడల్ బై-ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో న్యూ ఏరోడైనమిక్ 3D ఫ్రంట్‌తో వస్తుంది. దీని సింగిల్-డిస్క్ వేరియంట్ మరింత ఎత్తుగా ఉంటుంది. డ్యుయల్-డిస్క్ వేరియంట్ స్ప్లిట్ సీటుతో, స్పోర్టియర్ స్టాన్స్‌తో అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఈ బైక్‌లో సీటు ఎత్తు 790 మిల్లీమీటర్లు ఉంటుంది.
బ్రేకింగ్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్ వెర్షన్లో ముందు భాగంలో 260 mm డిస్క్ యూనిట్, వెనుక 230 mm డిస్క్ యూనిట్‌తో రానున్నాయి. సింగిల్ సీట్ వేరియంట్లో ముందు 260 mm డిస్క్, వెనుక 130 mm డ్రమ్‌తో వస్తుంది.
* తగ్గిన బరువు
కొత్త బజాజ్ పల్సర్ P150 బరువు కేవలం 140 కేజీలు ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే 10 కేజీలు తక్కువ కావడం విశేషం. అయితే దీని పవర్-టు-వెయిట్ నిష్పత్తి 11 శాతం పెరిగింది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, న్యూ మోనో-షాక్ రియర్ సస్పెన్షన్, ఇన్ఫినిటీ డిస్ప్లే కన్సోల్, USB మొబైల్ ఛార్జింగ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ రీడౌట్, సింగిల్-ఛానల్ ABS వంటి ముఖ్యమైన ఫీచర్స్ ఈ బైక్ సొంతం.
* ఇంజిన్ కెపాసిటీ
పల్సర్ P150 బైక్‌లో 149.68cc ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500 rpm వద్ద 14.3 bhp పవర్‌ను, 6,000 rpm వద్ద 13.5 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. బజాజ్ పల్సర్ P150 రెండు వేరియంట్లు.. రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్ వంటి ఐదు కలర్స్ ఆప్షన్స్‌లో లభిస్తాయి. ఈ బైక్‌ను ఇటీవల కోల్‌కతాలో లాంచ్ చేయగా, రాబోయే వారాల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న మోదీ సర్కార్ ?.. ఏడేళ్ల తరువాత కీలక మార్పు
FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచిన మరో బ్యాంక్.. స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ లాంచ్.. వివరాలివే
* వాటికి పోటీ
బజాజ్ ఆటో భారత మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త పల్సర్ P150 బైక్ మంచి డిజైన్, అడ్వాన్స్ ఫీచర్స్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిచనుంది. అయితే ఈ బైక్ మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ, టీవీఎస్ అపాచే ఆర్టిఆర్ 160 2వి, హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా అమ్మకాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bajaj