Festival సీజన్లో Bajaj సంస్థ రికార్డు అమ్మకాలు..Two Wheeler సేల్స్ లో జూమ్..

పండుగ సీజన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అక్టోబర్ లో Bajaj ఆటో ఇండియా ఏకంగా 5,12,038 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో 4,63,208 యూనిట్లను ఆ సంస్థ అమ్మింది. ఈ సంవత్సరం అమ్మకాల్లో 11 శాతం పెరుగుదల నమెదైనట్లు Bajaj కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

news18-telugu
Updated: November 2, 2020, 3:19 PM IST
Festival సీజన్లో Bajaj సంస్థ రికార్డు అమ్మకాలు..Two Wheeler సేల్స్ లో జూమ్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పండుగ సీజన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అక్టోబర్ లో Bajaj ఆటో ఇండియా ఏకంగా 5,12,038 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో 4,63,208 యూనిట్లను ఆ సంస్థ అమ్మింది. ఈ సంవత్సరం అమ్మకాల్లో 11 శాతం పెరుగుదల నమెదైనట్లు Bajaj కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అయినా కంపెనీ షేర్ దాదాపు 2 శాతం నష్టపోయింది. దేశీయ అమ్మకాలు 2,78,776 యూనిట్ల నుంచి ఒక శాతం పెరిగి 2,81,160 యూనిట్లకు చేరుకున్నాయని Bajaj సంస్థ తెలిపింది. ఎగుమతులు కూడా 25 శాతం పెరిగాయి. గత ఏడాది అక్టోబరులో 1,84,432 యూనిట్లు ఎగుమతి కాగా, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 2,30,878 యూనిట్లను ఆ సంస్థ ఎగుమతి చేసింది.

ద్విచక్ర వాహనాల అమ్మకాలూ పెరిగాయి

ఈ సీజన్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. 2019 అక్టోబర్‌లో 3,98,913 యూనిట్ల టూ వీలర్లు అమ్ముడయ్యాయి. ఈ అక్టోబర్‌లో 4,70,290 యూనిట్ల అమ్మకాలతో 18 శాతం వృద్ధి నమోదైనట్టు Bajajఆటో ప్రకటించింది. ఒక నెలలో అత్యధిక అమ్మకాలు ఇవే కావడం విశేషం. 1,70,000 పల్సర్ మోడల్ యూనిట్లను ఆ సంస్థ విక్రయించింది. పల్సర్ బ్రాండ్‌కు కూడా ఇది ఒక రికార్డు.

దేశీయ అమ్మకాల్లో వృద్ధి

 మొత్తం అమ్మకాల్లో 2,68,631 దేశీయంగా నమోదయ్యాయి. గతేడాది అక్టోబరులో అమ్మిన 2,42,516 యూనిట్లతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. ఎగుమతులు కూడా 3,98,913 నుంచి 18 శాతం  పెరిగి 4,70,290 యూనిట్లకు చేరుకున్నాయి.

వీటి వాటా తగ్గింది

కమర్షియల్ వాహనాల (సీవీ)అమ్మకాలు మాత్రం 35 శాతం తగ్గాయి. గత ఏడాది అక్టోబరులో 64,295 యూనిట్ల వాహనాలను అమ్మగా, 2020 అక్టోబర్‌లో 41,748 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో 12,529 యూనిట్లను మన దేశంలో అమ్మారు. పోయిన సంవత్సరం ఈ విభాగంలో అమ్మకాలు భారీగా 36,260 యూనిట్ల వరకు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో మాత్రం అమ్మకాలు 65 శాతం తగ్గాయి. ఎగుమతులు 29,219 యూనిట్ల నుంచి 28,035కు, నాలుగు శాతం పెరిగాయి.

ఏప్రిల్ నుంచి చూస్తే తక్కువే

ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో నమోదైన మొత్తం అమ్మకాలు మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గాయి. పోయిన సంవత్సరం నమోదైన 28,83,973 యూనిట్ల నుంచి 30 శాతం మేర తగ్గి 20,08,478 యూనిట్లకు పరిమితమయ్యాయి. దేశీయ అమ్మకాలు 16,05,009 యూనిట్ల నుంచి 35 శాతం తగ్గి 10,46,009 యూనిట్లకు, ఎగుమతులు 12,78,964 యూనిట్ల నుంచి 25 శాతం తగ్గి 9,62,469 యూనిట్లకు చేరుకున్నాయి.

సెప్టెంబరు నుంచే పెరుగుదల

అమ్మకాలు పెరిగే ధోరణి 2020 సెప్టెంబరు నుంచి కొనసాగింది. ఆ నెలలో కంపెనీ మొత్తం 4,41,306 వాహనాలను (కమర్షియల్ వేకిల్స్, ద్విచక్ర వాహనాలు కలిపి) విక్రయించింది. 2019 సెప్టెంబర్‌లో అమ్మిన 4,02,035 యూనిట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కవ కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరులో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. గత సెప్టెంబరులో 1,86,534 యూనిట్లు ఎగుమతి కాగా, ఈ సంవత్సరం అదే నెలలో ఎగుమతులు 14శాతం వృద్ధితో 2,12,575 యూనిట్లకు చేరుకోవడం విశేషం. ఆ నెలలో ద్విచక్ర వాహనాల ఎగుమతులు పెరగడంతో, మొత్తం ఎగుమతుల సంఖ్య కూడా పెరిగిందని Bajaj సంస్థ తెలిపింది.
Published by: Krishna Adithya
First published: November 2, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading