బజాజ్ ఆటో నుంచి మరో బైక్ భారతీయ రోడ్లపైకి వచ్చేసింది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఫీచర్‌తో తొలి 110సీసీ బైక్‌ను లాంఛ్ చేసింది బజాజ్ ఆటో. ఈ ఫీచర్‌తో 2023 బజాజ్ ప్లాటీనా 110 మోడల్‌ను పరిచయం చేసింది. భారతదేశంలో ఈ సెగ్మెంట్‌లో ఏబీఎస్ ఫీచర్ ఉన్న తొలి 110సీసీ బైక్ ఇదే కావడం విశేషం. సింగిల్ ఏబీఎస్ యూనిట్‌తో వస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలను కలిగి ఉందని, ఈ ప్రమాదాల్లో 45% ద్విచక్రాల వాహనాలతోనే జరిగాయని, రైడర్లు తరచుగా ప్యానిక్ బ్రేకింగ్ అనుభవాలను ఎదుర్కొంటున్నారని భారతీయ వినియోగదారులు చెబుతున్నారని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏబీఎస్‌తో సరికొత్త ప్లాటినా 110 రూపొందించామని, రైడర్లకు పూర్తి నియంత్రణను అందించాలని అనుకుంటున్నామని బజాజ్ ఆటో, మోటార్‌సైకిల్స్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే తెలిపారు.
2023 బజాజ్ ప్లాటీనా 110 ఎబోనీ బ్లాక్, గ్లాస్ ప్యూటర్ గ్రే, కాక్‌టైల్ వైన్ రెడ్, సఫైర్ బ్లూ కలర్స్‌లో రిలీజైంది. సరికొత్త బజాజ్ ప్లాటినా 110 బైక్‌లో 115.45 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7000 rpm వద్ద 8.6 PS గరిష్ట శక్తిని, 5000 rpm వద్ద 9.81 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్లాటినా 110 ABS టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెనుక భాగంలో డ్రమ్, భాగంలో డిస్క్ ద్వారా బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంజిన్ నాలుగు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది.
Araku Tour: హైదరాబాద్ నుంచి అరకు ... 5 రోజుల టూర్ రూ.6,999 మాత్రమే
2023 బజాజ్ ప్లాటినా 110 బైక్‌లో 11 లీటర్ కెపాసిటీతో ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. మోటార్‌సైకిల్ 17-అంగుళాల అల్లాయ్ ఫ్రంట్, రియర్ వీల్స్‌పై నడుస్తుంది. గరిష్టంగా 90kmph వేగాన్ని అందించగలదు. హాలోజన్ హెడ్‌ల్యాంప్, LED DRL ఉన్నాయి. 2023 బజాజ్ ప్లాటినా 110 బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.72,224.
Vande Metro Trains: పేదల కోసం వందే మెట్రో ట్రైన్స్... భారతీయ రైల్వే కొత్త ప్లాన్
భారతదేశంలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఉన్న బైక్ కొనాలంటే కనీసం రూ.1 లక్ష ఖర్చు చేయాలి. తక్కువ ధరలో, తక్కువ కెపాసిటీతో ఉన్న బైకుల్లో ఈ ఫీచర్ కనిపించదు. బజాజ్ నుంచి 110 సీసీ మోడల్‌లో ఏబీఎస్ ఫీచర్ ఉన్న బైక్ రావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Bajaj, Two wheeler