Bajaj Pulsar NS 125: కొత్త పల్సర్ బైక్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

Bajaj Pulsar NS 125: కొత్త పల్సర్ బైక్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే (Image: Bajaj Auto)

Bajaj Pulsar NS 125 | కొత్త పల్సర్ బైక్ కొనాలనుకుంటున్నారా? బజాజ్ ఆటో కొత్తగా పల్సర్ ఎన్ఎస్ 125 మోడల్‌ను రిలీజ్ చేసింది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్​ ఆటో కొత్త పల్సర్​ బైక్​ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. భారత మార్కెట్​లో ప్రస్తుతం విక్రయిస్తున్న పల్సర్ సిరీస్​లో తాజాగా మరో కొత్త మోడల్​ను లాంఛ్ చేసింది. ఎన్ఎస్125 పేరుతో ఈ బైక్​ భారత మార్కెట్​లోకి విడులైంది. 124.45 సిసి ఇంజిన్​తో పనిచేసే ఈ సరికొత్త బైక్ ధరను రూ. 93,690 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. బజాజ్ కొత్త 125 సిసి బైక్‌ బీచ్ బ్లూ, ఫైరీ ఆరెంజ్, బర్న్​ రెడ్, ప్యూటర్ గ్రే అనే నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పల్సర్ సిరీస్​లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని బైక్​లలో కన్నా ఇదే అత్యంత సరసమైన, తక్కువ సీసీ కలిగిన బైక్​ కావడం విశేషం. యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ బైక్​ను ప్రవేశపెట్టింది. బజాజ్​ పల్సర్​ ఎన్ఎస్ సిరీస్​లో కంపెనీ ఇప్పటికే పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్​ఎస్​ 200 మోడళ్లను విక్రయిస్తోంది. ఈ సిరీస్​లో ఇప్పుడు కొత్తగా పల్సర్ ఎన్ఎస్ 125 వచ్చి చేరింది.

మార్కెట్​లో ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్ల ప్రారంభ ధరలు వరుసగా రూ. 1.11 లక్షలు, రూ. 1.35 లక్షలుగా ఉన్నాయి. ఈ కొత్త బజాజ్​ పల్సర్​ ఎన్ఎస్ 125 బైక్​లో బిఎస్​ 6 కంప్లైంట్​ 125 సిసి డిటిఎస్​–ఐ ఇంజిన్​ను ఉపయోగించారు. ఈ ఇంజిన్​ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 12 బిహెచ్​ పవర్​ను, 7000 ఆర్​పిఎమ్​ వద్ద 11 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఇంజిన్​ మార్పు మినహా, డిజైన్​ పరంగా చూస్తే ఇది అచ్చం పల్సర్​ ఎన్​ఎస్​ 160 మాదిరిగానే ఉంటుంది.

Most Expensive Bikes: ఇండియాలో లభిస్తున్న కాస్ట్‌లీ బైక్స్ ఇవే... ధర ఎంతో తెలుసా?

Flipkart Quick: ఆర్డర్ చేసిన గంటన్నరలో డెలివరీ... ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్

మొత్తం 4 కలర్​ వేరియంట్లలో లభ్యం


బజాజ్​ పల్సర్ ఎన్ఎస్ 125 మోడల్​ను పెరిమీటర్​ ఫ్రేమ్​తో తయారు చేశారు. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్​ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్​ సస్పెన్షన్​ సెటప్​లను అందించారు. ఇందులోని నైట్రిక్స్​​ మోనోషాక్ అబ్జార్బర్​.. అధిక వేగంతో ప్రయాణిస్తున్న సందర్భంలోనూ మంచి స్థిరత్వాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాక దీనిలోని ట్విన్ పైలట్ లాంప్స్​తో కూడిన సిగ్నేచర్ వోల్ఫ్- ఐడ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, హై గ్లోస్ మెటాలిక్ పెయింట్, కాంస్యంతో తయారు చేసిన అల్లాయ్ వీల్స్, ఇన్ఫినిటీ ట్విన్-స్ట్రిప్ ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్, స్పోర్టి స్ప్లిట్ గ్రాబ్ రైల్ వంటివి బైక్​ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.

JioFiber Free Trial: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ వివరాలివే

Poco M2 Reloaded: పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే

ఈ కొత్త మోడల్​ విడుదలపై బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్ సారంగ్ కనడే మాట్లాడుతూ ‘యువతను దృష్టిలో పెట్టుకొని ఈ పెర్ఫార్మెన్స్ రైడింగ్ బైక్​ను విడుదల చేస్తున్నాం. అధిక సిసి ఇంజిన్​తో కూడిన ఈ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ బైక్​ను పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ బైక్​లో అందించిన అద్భుతమైన ఫీచర్లు పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నాం. ఎంట్రీ స్పోర్ట్ బైక్ విభాగంలో పల్సర్ 125 ఎలాగైతే మంచి ఆదరణ పొందిందో అలాగే.. కొత్త ఎన్ఎస్ 125 బైక్​ కూడా బజాజ్​ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.
Published by:Santhosh Kumar S
First published: