Bajaj electric Chetak: బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... బుకింగ్ ధర రూ.2,000 మాత్రమే

Bajaj electric Chetak | బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ సరికొత్త లుక్స్‌లో అబ్బురపరుస్తోంది. ఆకట్టుకునే డిజైన్, అదిరిపోయే కలర్స్, ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా ఫీచర్స్ ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: January 14, 2020, 4:08 PM IST
Bajaj electric Chetak: బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... బుకింగ్ ధర రూ.2,000 మాత్రమే
Bajaj electric Chetak: బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... బుకింగ్ ధర రూ.2,000 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బజాజ్ చెతక్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న 'బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్' వచ్చేసింది. గతేడాదే ఈ వాహనాన్ని పరిచయం చేసింది బజాజ్ ఆటో. ఇవాళ అధికారికంగా మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ప్రభుత్వ సబ్సిడీలతో కలిపి ఎక్స్ షోరూమ్ ధర రూ.1,00,000. 'బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్' బుకింగ్ జనవరి 15న ప్రారంభం అవుతుంది. అర్బన్, ప్రీమియం మోడల్స్‌లో మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది 'బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్'. ఒకసారి ఛార్జింగ్ చేయడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. బ్యాటరీలు బయటకు తీసి ఛార్జింగ్ చేసే సదుపాయం కూడా లేదు. మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లలో ఏది ముందైతే అది వారెంటీ ఇస్తోంది కంపెనీ. బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్‌ బుకింగ్ జనవరి 15న ప్రారంభం కానుంది. రూ.2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. పుణె, బెంగళూరులో 13 డీలర్‌షిప్స్ బుకింగ్స్ స్వీకరిస్తాయి. ప్రస్తుతం 'బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్' పుణె, బెంగళూరులో మాత్రమే లభిస్తుంది. డిమాండ్‌ను బట్టి త్వరలో మిగతా పట్టణాల్లో కూడా 'బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్' అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఏథర్, ఒకినావా, హీరో ఎలక్ట్రిక్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. వాటికి పోటీగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసింది బజాజ్.

స్కూటర్ బిజినెస్‌ను పునరుద్ధరించేందుకు బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టింది. 1960 నుంచి కొన్ని దశాబ్దాలపాటు టూవీలర్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన బజాజ్ చెతక్‌ను ఎలక్ట్రిక్ మోడల్‌లో సరికొత్త హంగులతో, ఈ తరం కుర్రాళ్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించడం వెనుక రెండేళ్ల కృషి ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్‌లో సుమారు 1000 మంది కలిసి ఈ స్కూటర్‌ను రూపొందించారు. పూణె సమీపంలోని ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తోంది కంపెనీ. బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ సరికొత్త లుక్స్‌లో అబ్బురపరుస్తోంది. ఆకట్టుకునే డిజైన్, అదిరిపోయే కలర్స్, ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా ఫీచర్స్ ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. డేటా కమ్యూనికేషన్, సెక్యూరిటీ, యూజర్ ఆథెంటికేషన్ లాంటివన్నీ యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ ఎలా ఉందో ఫోటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్‌మీ ఎక్స్2 ప్రో అద్భుతం



ఇవి కూడా చదవండి:

Gold: మార్కెట్ రేట్ కన్నా రూ.1,800 తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా

PPF New Rules: మారిన పీపీఎఫ్ రూల్స్‌తో లాభమా... నష్టమా? తెలుసుకోండిSukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన... ఈ అకౌంట్‌తో ఎన్నో లాభాలు
First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading