Home /News /business /

BAJAJ AUTO IS ALL SET TO LAUNCH ANOTHER ELECTRIC SCOOTER SOON AND EXPERTS SAY ITS MAY HUSQVARNA VECTOR MODEL PRV GH

Bajaj Auto: బజాజ్​ నుంచి త్వరలోనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్​.. హస్క్‌వర్నా వెక్టార్ మోడల్​ కావొచ్చంటున్న ఎక్స్​పర్ట్స్

(Photo: tusharpawar911/Instagram)

(Photo: tusharpawar911/Instagram)

దేశీయ వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj auto) మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Electric Scooter)ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ను తాజాగా భారతీయ రోడ్లపై పరీక్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇంకా చదవండి ...
రోజు రోజుకు టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు పెట్రోల్​, డీజిల్​ వాహనాలను (Petrol and diesel Price) నడుపుతున్న వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాల్ని (Electric vehicles) నడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో వారి ఉత్సాహం, వినియోగానికి అనుగుణంగా ఆయా ఆటో మొబైల్​ సంస్థలు (Auto mobiles company) కొత్త కొత్త మోడళ్లతో సరికొత్త హంగులతో ఎలక్ట్రిక్​ వాహనాలను మార్కెట్​లోకి లాంచ్​ (launch) చేస్తున్నాయి. తాజాగా దేశీయ వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj auto) మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Electric Scooter)ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ను తాజాగా భారతీయ రోడ్లపై (Indian Roads) పరీక్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్​ వెహికల్​ (New Electric vehicle) లాంచింగ్​​పై కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

రాబోయే ఈ–స్కూటర్​ (E scooter)పై ఎటువంటి స్పష్టత లేనప్పటికీ.. ఇది హస్క్‌వర్నా వెక్టార్ మోడల్​గా విడుదల కానుందని ఆటో ఎక్స్​పర్ట్స్ (Auto experts) చెబుతున్నారు. ఈ కొత్త మోడల్ (new model)​.. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్​ చేసిన హుస్క్‌వర్నా వెక్టార్ (Husqvarna Vector) కాన్సెప్ట్‌ను పోలి ఉన్నందున దీనికి బలం చేకూరుతోంది. అయితే తాజా మోడల్​ గురించి బజాజ్ (Bajaj)​ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న టెస్ట్​ రైడ్​ ఫోటోలు..

బజాజ్​ నుంచి విడుదలకు సిద్దమవుతోన్న ఎలక్ట్రిక్​ స్కూటర్​లో అత్యాధునిక ఫీచర్లు (Features) అందించే అవకాశం ఉంది. దీనిలో స్ప్లిట్ సీట్లు, అల్లాయ్ వీల్స్, వెనుక టైర్ హగ్గర్, 100 శాతం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ (Digital Instrument Cluster‌)ను చేర్చనుంది. ఇక దీని వెనుక భాగంలో ఓహ్, హెడ్‌లైట్ ఆప్రాన్‌ను అమర్చనున్నారు. భారతదేశంలో రాబోయే ఈ హస్క్‌వర్నా వెక్టార్ ఎలక్ట్రిక్​ స్కూటర్ (Husqvarna Vector electric scooter)​లోని ఫీచర్లు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్​తో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, రాబోయే ఈ స్కూటర్​ 4 kW మోటార్, 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది.

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఒకే ఛార్జ్‌పై 95 కిలో మీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందించగలదు. ఇక, బజాజ్​ తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​ చేతక్ (Chetak is Bajaj's first electric scooter)​కు మార్కెట్​లో గణనీయమైన రెస్పాన్స్​ వచ్చింది. ఈ స్కూటర్​ 2021 జనవరిలో మార్కెట్​లోకి రిలీజైంది. బజాజ్​ చేతక్​ ప్రస్తుతం అర్భన్​, ప్రీమియం​ అనే రెండు వేరియంట్ల (Two Variants)లో లభిస్తుంది. ఈ స్కూటర్ మొత్తం 6 కలర్​ ఆప్షనల్లో లభిస్తుంది. దీనిలో ఐపీ 67 రేటెడ్​ లిథియం అయాన్​ బ్యాటరీని అమర్చింది. దీనికి అదనంగా స్వింగార్మ్​ మౌంటెడ్​ మోటార్ (Swingarm mounted motor)​ను కూడా ఉపయోగించింది. ఇది ఎకో, స్పోర్ట్స్​ అనే రెండు వేర్వేరు మోడ్​లలో పనిచేస్తుంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bajaj, Electric Bikes, Electric vehicle, SCOOTER

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు