Bajaj Allianz Criti Care critical illness policy | బజాజ్ అలియాంజ్ క్రిటికేర్ పేరుతో క్రిటికల్ ఇల్నెస్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ 43 తీవ్ర అనారోగ్యాలను కవర్ చేస్తుంది.
ఒకప్పుడు ఆరోగ్య బీమా గురించి ఎక్కువగా ఆలోచించే వారు కాదు. కానీ, కరోనా విజృంభనతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం బీమా కలిగి ఉండటం అనేది ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ బీమా సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా, ప్రముఖ బీమా సంస్థ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్.. క్రిటికేర్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ కింద గరిష్టంగా 43 తీవ్ర అనారోగ్య వ్యాధులకు కవరేజీ లభిస్తుంది. ప్రస్తుతం ఇతర పోటీ సంస్థలు సగటున 5 నుంచి 30 వ్యాధులకు బీమా కవరేజీని అందిస్తుండగా.. ఇది 43 వ్యాధులకు కవరేజీ అందిస్తుండటం విశేషం. కాగా, మార్కెట్ రిసెర్చ్, కస్టమర్ల అభిప్రాయం ఆధారంగా ఈ నూతన పాలసీని రూపొందించినట్లు బజాజ్ అలియాంజ్ వివరించింది. ఈ ప్లాన్ కింద క్యాన్సర్ కేర్, కార్డియోవాస్కులర్ కేర్, కిడ్నీ కేర్, న్యూరో కేర్, ట్రాన్స్‌ప్లాంట్ కేర్, డయాలసిస్ కేర్, ఫిజియోథెరపీ కేర్ వంటి వాటికి కవరేజీ లభిస్తుందని పేర్కొంది.
"మా కొత్త ప్లాన్ 43 క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీలో ఇనిషియల్, అడ్వాన్సుడ్ స్టేజెస్‌లో ఉన్న క్రిటికల్ వ్యాధులను చేర్చాము. కస్టమర్ల అవసరాలను అనుగుణంగా, అన్ని రకాల వ్యాధులకు కవరేజీని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పాలసీను రూపొందించాం. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం చూడకుండా.. వేగంగా కోలుకోవడానికి కావాల్సిన చికిత్స అందిచడానికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది." అని స్పష్టం చేసింది. కాగా, ఈ పాలసీ కింద గరిష్టంగా రూ.2 కోట్ల వరకు కవరేజీని పొందవచ్చని తెలిపింది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్న పెద్దలు, 3 నెలల నుంచి 30 ఏళ్ల మధ్య గల పిల్లలు, యువకులు ఈ బీమాను కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ నుండి నుంచి ఏ వయస్సులోనైనా ఎగ్జిట్ కావచ్చు. అయితే, ఈ పాలసీని జీవితకాలం పాటు రెన్యువల్ చేసుకునే వీలుంటుంది.
ఈ పాలసీ కింద వ్యక్తిగత, భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్త, మామలు, మనువళ్లు, మనవరాళ్ళు ఇలా అందరికీ కవరేజీ లభిస్తుందని బజాజ్ అలియాంజ్ వెల్లడించింది. ఈ పాలసీలో చేరిన వారు తమ ప్రీమియంలను వాయిదాల రూపంలో కూడా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యవధిలో పాలసీ తీసుకున్నవారికి, ఆన్లైన్ ద్వారా పాలసీ కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ కూడా లభిస్తుందని పేర్కొంది.
కవరేజీ విధానం ఇలా
క్రిటి-కేర్ అనేది బెనిఫిట్ ఓన్లీ పాలసీ. అంటే జాబితా చేయబడిన అనారోగ్యాలతో పాలసీదారుడు లేదా కుటుంబ సభ్యులు బాధపడుతుంటే చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఒకే సారి చెల్లిస్తుంది. కాగా, ఈ పాలసీలో- క్యాన్సర్ కేర్, కార్డియోవాస్కులర్ కేర్, కిడ్నీ కేర్, న్యూరో కేర్, ట్రాన్స్‌ప్లాంట్ కేర్, సెన్సరీ ఆర్గాన్ కేర్ అనే మొత్తం 5 విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి రూ. 1 లక్ష నుండి రూ. 50 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, పాలసీ బీమా గరిష్టంగా రూ .2 కోట్ల వరకు ఉంటుంది. ప్రతి విభాగంలోని వ్యాధులను ‘కేటగిరీ ఎ’, ‘కేటగిరీ బీ’ అని రెండు విధాలుగా విభజిస్తారు. కేటగిరీ ఎ కింద ప్రారంభ దశ వ్యాధులు ఉంటే, కేటగిరీ బీ కింద అధునాతన వ్యాధులను పేర్కొన్నారు. క్లెయిమ్ కేటగిరీ ‘ఎ’ కిందకు వచ్చే వ్యాధి భారీన పడితే.. బీమా మొత్తంలో 25% వరకు క్లెయిమ్ పొందవచ్చు. అదే కేటగిరి బి కింద 100% వరకు క్లెయిమ్ కోరవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.