Home /News /business /

BAIDU COMPANY UNVEILS AUTONOMOUS VEHICLE WITHOUT STEERING WHEEL AND KNOW FULL DETAILS OF DRIVERLESS CAR VB

Driverless Car: కారులో డ్రైవర్ లేకుండానే షికారుకు.. స్టీరింగ్ లేకుండా కొత్త కారు లాంచ్ .. దీని ఖరీదు ఎంతో తెలుసా..?

Driverless Car: కారులో డ్రైవర్ లేకుండానే షికారుకు.. స్టీరింగ్ లేకుండా కొత్త కారు లాంచ్ .. దీని ఖరీదు ఎంతో తెలుసా..?

Driverless Car: కారులో డ్రైవర్ లేకుండానే షికారుకు.. స్టీరింగ్ లేకుండా కొత్త కారు లాంచ్ .. దీని ఖరీదు ఎంతో తెలుసా..?

సాధారణంగా ఏ వాహహనం అయినా.. డ్రైవర్ లేనిదే వాహనం ముందుకు సాగదు. రోడ్లపై డ్రైవర్ లేకుండా నడిపే వాహనాలు దాదాపు ఉత్పత్తి కాలేదనే చెప్పాలి. అంతరిక్షంలోకి కూడా.. మానవ రహిత రాకెట్లను పంపిస్తున్నారు. అలాంటి టెక్నాలజీ వైపు ఇస్రో పయనిస్తోంది.

ఇంకా చదవండి ...
సాధారణంగా ఏ వాహహనం అయినా.. డ్రైవర్ (Driver) లేనిదే వాహనం ముందుకు సాగదు. రోడ్లపై డ్రైవర్ లేకుండా నడిపే వాహనాలు దాదాపు ఉత్పత్తి(Production) కాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా టెక్ కంపెనీలు(Tech Companies) మానవ రహిత లేదా డ్రైవర్ లేకుండా వెళ్లే కార్లను(Cars) తయారు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆ వైపు పయనిస్తోంది చైనా. చైనీస్ సెర్చ్ ఇంజన్ సర్వీస్ కంపెనీ బైడు కొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసింది. ఈ వాహనం స్టీరింగ్ వీల్ లేకుండా అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది నాటికి చైనాలో(China) రోబో-టాక్సీ(Robo Taxi) సేవలను అందించడానికి ఈ వాహనం ఉపయోగించబడుతుంది. ఈ కొత్త ఆటోమేటిక్ వాహనం ధర 2 లక్షల 50 వేల యువాన్ల వరకు ఉంటుందని బైడు కంపెనీ తెలియజేసింది.

SA Preparation Tips: ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే.. ఈ పుస్తకాలను చదివేయండి.. కొలువు పక్కా..!


ఇదే వాహనం మునుపటి తరం మోడల్ ధర 4 లక్షల 80 వేల యువాన్లుగా నిర్ణయించడం గమనార్హం. దీనిపై బైడు CEO రాబిన్ లి మాట్లాడుతూ.. భారీ ధరల తగ్గింపుతో, తాము చైనా అంతటా స్వయంప్రతిపత్తి గల వాహనాల సంఖ్యను పెంచగలమన్నారు. తాము భవిష్యత్తులోకి ఇటువంటి వాహనాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రోబో-టాక్సీలో ప్రయాణించడానికి మీకు ప్రస్తుత టాక్సీ ధరలో సగం ధర ఉంటుందన్నారు. కొత్త వాహనంలో అటానమస్ లెవల్ 4 టెక్నాలజీని అమర్చినట్లు పేర్కొన్నారు. ఈ కారు ప్రయాణించడానికి ఎలాంటి డ్రైవర్ అవసరం లేదని తెలిపారు. కారులో మొత్తం ఎనిమిది లైడార్లు మరియు 12 కెమెరాలు ఉంటాయన్నారు.



లిడార్లు అనేవి.. రేడియో తరంగాల కంటే పల్సెడ్ లేజర్ కాంతిని ఉపయోగించే రాడార్‌ల మాదిరిగానే గుర్తిస్తాయి. ఇవి రాడార్లకు సమానమైన సేవలను అందిస్తాయన్నారు. వీటి తయారీకి ఎలాంటి పరికరాలను ఉపయోగించారనే విషయాలను వెల్లడించలేదు. ఈ AV డ్రైవింగ్ సామర్థ్యం 20 సంవత్సరాల అనుభవం ఉన్న నైపుణ్యం కలిగిన మానవ డ్రైవర్‌తో సరిపోలుతుందని సమావేశంలో బైడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లి జెన్యు అన్నారు.

అయితే దీనిని చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. ఆమోదం పొందితేనే ఇది రోడ్లపై పరుగులు పెట్టగలదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు , టెక్ కంపెనీలు ఇటువంటి వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాల అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.



బీజింగ్‌లోని ఓపెన్ రోడ్‌లలో డ్రైవింగ్ సీటులో ఎవరూ లేకుండా రోబోటాక్సీలను నడుపుటకు అనుమతులు పొందినట్లు బైడు ఏప్రిల్‌లో తెలిపింది. ఇదిలా ఉండగా.. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలోన్ మస్క్ ఏప్రిల్‌లో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 2024లో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ లేకుండా రోబోటాక్సీని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతే కాకుండా రోబోట్యాక్సీ ప్రయాణానికి బస్ టిక్కెట్ కంటే తక్కువ ధర ఉంటుందని అంచనా వేశారు. దీనిలో భాగంగానే చైనా ఆ దిశగా అడుగులు వేసింది. రాబోయే సంవత్సరాల్లో యుఎస్‌లో తన డ్రైవర్ లెస్ వాహనాలను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఆల్ఫాబెట్ స్టీరింగ్ వీల్ లేని రోబోటాక్సీని ఆవిష్కరించించిన సంగతి తెలిసిందే.
Published by:Veera Babu
First published:

Tags: Business, Cars, China, Drivers, Steering

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు